LIVE : తిరుపతిలో కాంగ్రెస్ న్యాయసాధన సభ - ప్రత్యక్ష ప్రసారం - ap congress public meeting
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 6:02 PM IST
|Updated : Mar 1, 2024, 6:52 PM IST
AP Congress Public Meeting in Tirupati Live : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఈ నేపథ్యంలో తిరుపతిలో కాంగ్రెస్ న్యాయసాధన సభ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా డిక్లరేషన్ కోసం న్యాయసాధన పేరుతో ఈ కార్యక్రమంఎస్వీ తారకరామ స్టేడియంలో నిర్వహించారు. సభలో పాల్గొననున్న రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో ఈ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సభలో కొన్ని కీలక ప్రకటనలు చేయస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని చెప్పనున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీకి అవకాశమివ్వాలని రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలని పీసీసీ సమావేశంలో చర్చించి ప్రాథమికంగా నిర్ణయించనున్నారు. ఏఐసీసీ నుంచి ఆమోదం వచ్చాక అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Last Updated : Mar 1, 2024, 6:52 PM IST