జగన్ అవినీతిపై ఎంపీ రఘరామ పిటిషన్- ఎన్నికల తరువాత విచారణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 3:41 PM IST
Adjournment Of Mp Raghu Rama Krishnam Raju Petition To Next Week: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అవినీతిపై (Corruption) సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిల్ (PIL) విచారణను హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ సర్కార్ ప్రజాధనానికి నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుందని పిల్లో రఘురామకృష్ణ పేర్కొన్నారు. ఎంపీ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రచారం కోసం పిల్ వేసినట్లు ప్రతివాదులు ఆరోపణ చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా అభ్యంతరం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చామని రఘరామ కృష్ణం రాజు పేర్కొన్నారు.
ఆ వివరాలతో మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిందని రఘరామ కృష్ణం రాజు వెల్లడించారు. అనంతరం రఘురామ కృష్ణం రాజు హైకోర్టు నుంచి తుళ్లూరు రైతుల దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణ రాజుకి రాజధాని రైతులు, మహిళలు సాదర స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేనకు 130 సీట్లు వస్తాయని అంచనా వేశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పుడు బీజేపీ కూడా జత కలవడంతో 135కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తారని రఘరామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ఆంధ్రాలో అడుగుపెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని విమర్శించారు.