ఒంగోలులో యాక్ట్ ఫైబర్ నెట్ కంపెనీ యూనిట్ - Act Fiber Net Company in Ongole - ACT FIBER NET COMPANY IN ONGOLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 7:04 PM IST
Act Fiber Net Company in Ongole District : యాక్ట్ ఫైబర్ నెట్ కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలులోనూ ఓ యూనిట్‌ను స్థాపించింది. ఓ హోటల్లో యాక్ట్ ఫైబర్‌నెట్ లాంఛింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అతి తక్కువ ధరలకే వినియోగదారులకు నాణ్యమైన సర్వీసు అందిస్తామని యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ యుగంధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు లాంటి పెద్ద మార్కెట్లో త్వరలోనే అత్యధిక మార్కెట్‌షేర్‌ను గెలవగలుగుతామని ఆయన తెలిపారు. ఒంగోలులో 90 శాతం వరకు మార్కెట్ విస్తరించామని ఆయన అన్నారు. అతి తక్కువ ధరలో యాక్ట్ సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిందని అన్నారు.
'ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైని ఒంగోలులో మా నెట్వర్క్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు అందుబాటులో స్మార్ట్‌గా మా సేవలను అందిస్తాము. మీరు ఆదరిస్తే త్వరలో అత్యధిక మార్కెట్ షేర్ సాధించి మార్కెట్లో లీడర్‌గా ఎదుగుతామని ఆశిస్తున్నాము.' -యుగంధర్, ఏసీటీ వైస్ ప్రెసిడెంట్