మళ్లీ 'పొలం పిలుస్తోంది' పథకం- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్న - Achchennaidu Took Charge - ACHCHENNAIDU TOOK CHARGE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 7:49 PM IST
Achchennaidu Took Charge as the Agriculture Minister : కూటమి ప్రభుత్వం రైతుసంక్షేమం కోసం పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసానిచ్చారు. వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖల మంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పొలం పిలుస్తోంది కార్యక్రమం దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన కార్యాలయంలో ప్రవేశించి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్న అచ్చెన్న ప్రస్తుతం ఎలాంటి సమస్యలున్నా తమకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి మంగళ, బుధవారాల్లో రైతుల వద్దకు వెళ్లాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. సాగులోని ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించి రాయితీపై యాంత్రీకరణ పరికరాలు అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.