₹54 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌పై కన్ను - ఎలా కొట్టేశారంటే ? - 54 lakhs Fraud With fake id - 54 LAKHS FRAUD WITH FAKE ID
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 4:34 PM IST
Forgery Case Filed in Machilipatnam : వయసు పైబడి పలు ఆరోగ్య సమస్యలతో గత డిసెంబర్లో ఓ వృద్దురాలు మరణించింది. మృతురాలు వేమురి లక్ష్మితులసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొడుగుపేట బ్రాంచ్‌లో రూ. 54 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఆమె బ్యాంక్ ఖాతాలో రూ. 54 లక్షలు ఉన్నాయని తెలిసిన బంధువు కాత్యాయనీ వాటిని ఎలాగైనా కాజేయాలనుకుంది. అయితే ఆ డబ్బులకు మృతురాలి సోదరి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రామ సుందరి నామినీగా ఉంది.
ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై కన్నేసిన మృతురాలి సోదరి కుమార్తె కాత్యాయనీ, సదరు ఫిక్స్డ్ డిపాజిట్‌కు తానే నామినీ అని పేర్కొంటూ, రామసుందరి గుర్తింపు కార్డులు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి ఎఫ్‌డీలోని 54 లక్షల రూపాయలు డ్రా చేసేసుకుంది. ఇది ఇలా ఉండగా గత నెలలో అసలు నామినీ రమాసుందరి బ్యాంక్‌కు వెళ్లి సొమ్ము డ్రా చేసేందుకు చూడగా అసలు విషయం బయట పడింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎస్బీఐ చీఫ్ మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తులో కాత్యాయనీ ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఆమెకు సహకరించిన కుమారుడు ఫణింద్ర సహా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.