400 ఫోన్లు కొట్టేశారు - 'హంట్ యాప్' ద్వారా పోలీసులు పట్టేశారు - mobile trace by Hunt App
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 5:48 PM IST
5 Crores Worth Phones Traced By Tirupathi Police: చోరీకి గురైన 400 ఫోన్లను మొబైల్ హంట్ యాప్ ద్వారా గుర్తించి యజమానులకు అప్పగించినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తెలిపారు. ఇప్పటి వరకు 9 విడతల్లో (Phases) అపహరణకు గురైన దాదాపు రూ. 5 కోట్లు విలువైన 2630 సెల్ ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో రూ. 72 లక్షల రూపాయల విలువైన 400 సెల్ ఫోన్లను (mobile phones) రికవరీ చేశామన్నారు. ఫోన్ల రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ టీంను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రికవరీ చేసిన ఫోన్లు బాధితులకు ఎస్పీ అందచేశారు.
Police Recovered 400 Stolen Phones Through Hunt App: ఫోన్లు పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగనవసరం లేకుండా హంట్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న ఫోన్‌పై సైబర్ క్రైం పోలీసులు నిఘా ఉంచుతారు. ముందుగా హంట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ‘హాయ్’ అని మేసేజ్ పంపితే మీకు వెంటనే ఒక గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేసి పోయిన ఫోన్ వివరాలు అంటే ‘ఐఎంఈఐ’ తదితరాలు నమోదు చేస్తే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు వెళుతుందని ఎస్పీ తెలిపారు.