హైదరాబాద్​ ఫొటో ఎగ్జిబిషన్ - ఈ అద్భుతాలపై మీరూ ఓ లుక్కేయండి - 24 Hour Project Photo Exhibition

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 8:47 PM IST

24 Hour Project Photo Exhibition In Hyderabad : ఫొటోగ్రఫీ అంటే కేవలం కళ్లకు ఆనందాన్ని కలిగించే అద్భుతమైన చిత్రాలే కావు దానిలోని అంతరంగాన్ని అర్థం చేసుకుంటే మాటలు చెప్పలేని ఎన్నో విషయాలు దృశ్యాలు తెలియజేస్తాయి. చిత్రాల ద్వారా ఆలోచనల్లో మార్పులు తెచ్చేందుకు , సానుకూల భావన కలగజేసేందుకు ఫోటోగ్రఫీ ఫర్ సోషల్ చేంజ్ పేరుతో 24హవర్ సంస్థ హైదరాబాద్​లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించిన స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ కార్యక్రమం. 

ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన డబ్బులను కలకత్తాలోని రెస్పాన్సిబుల్ చారిటీకీ ఇస్తామని వారు తెలిపారు. దేశ నలుమూల నుంచి ఔత్సాహికులైన, అనుభవజ్ఞులైన వందలాది ఫొటో గ్రాఫర్లు ఇందులో పాల్గొంటారని వారు వివరించారు. ఇందులో ఈ సంస్థ నిర్వహించిన పోటీల్లో బెస్ట్ 127 పిక్చర్స్​ను ఎంపిక చేసి ప్రదర్శించారు. ఇక్కడ కొలువుదీరిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్యను ఒక్కో సంస్కృతిని తెలియజెేస్తున్నాయి. వాటి ప్రత్యేకతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.