క్షణాల వ్యవధిలో వరద - చిక్కుకున్న 150 గొర్రెలు, ఇద్దరు కాపర్లు - Herdsmen Stuck in flood Waters - HERDSMEN STUCK IN FLOOD WATERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 2:25 PM IST
150 sheep and Two Herdsmen Stuck in flood Waters in Panladu District : పల్నాడు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అచ్చంపేట మండలం చామర్రు కృష్ణానది లంకభూముల్లో 150 గొర్రెలు సహా ఇద్దరు గొర్రెల కాపర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తారు. దీంతో ఒక్కసారిగా కృష్టానది లంకభూములను వరద నీరు చుట్టుముట్టింది. గొర్రెలు మేపడానికి వెళ్లిన కాపర్లు వరద నీటిలో చిక్కుకున్నారు.
అకస్మాత్తుగా వరదనీరు చుట్టుముట్టడంతో గొర్రె కాపర్లు ఎటు కదలేని పరిస్థితుల్లో అయోమయంలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. గొర్రెల కాపర్లును రక్షించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని, గొర్రెలను సురక్షితంగా తమ ప్రాంతంకు చేర్చడానికి ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.