ETV Bharat / technology

ఉద్యోగులకు టిక్​టాక్​ బిగ్​ షాక్- 700 మందికి పైగా తొలగింపు - TIKTOK LAYOFFS

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్​టాక్​లో లేఆఫ్​లు- 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన

TikTok Layoffs
TikTok Layoffs (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 11, 2024, 2:15 PM IST

TikTok Layoffs: ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ తన ఉద్యోగులకు బిగ్​ షాక్ ఇచ్చింది. మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. AI సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌లకు సంబంధించిన ఇ-మెయిల్స్‌ అందినట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల తొలగింపుపై టిక్​టాక్ కన్ఫార్మ్ చేసింది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కంపెనీ తన వ్యూహాత్యక చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కంటెంట్‌ మోడరేషన్‌ కోసం గ్లోబల్‌ ఆపరేషన్‌ మోడల్‌ను బలోపేతం చేయడానికి చేపడుతున్న ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం కూడా ఒకటని టిక్‌టాక్‌ ప్రతినిధి తెలిపారు.

ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారిలో 1,000 మందికి పైగా ఉద్యోగులను టిక్‌టాక్‌ తొలగించింది. కంటెంట్‌, మార్కెటింగ్‌ విభాగాల్లోనే ఈ తొలగింపులు జరిగాయి. త్వరలోనే మరో రౌండ్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉన్నట్లు సమాచారం. మరోవైపు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

ఇన్‌స్టా రీల్స్‌ నేరుగా థ్రెడ్స్​లోకి- సరికొత్త ఫీచర్​పై మెటా కసరత్తు

రతన్ టాటాని ఆలోచనలో పడేసిన సంఘటన- నానో కారు లాంచ్​ చేసేందుకు రీసన్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.