Samsung Enterprise Edition: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. కంపెనీ తన 'గెలాక్సీ S24', 'గెలాక్సీ S24 అల్ట్రా' మొబైల్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌లో విశేషం ఏంటంటే.. ఇవి రెండూ 3-సంవత్సరాల డివైజ్ వారంటీతో పాటు ఏడేళ్ల పాటు ఫర్మ్‌వేర్ అప్‌డేట్లతో వస్తున్నాయి. అంతేకాక ఈ మొబైల్స్‌లో 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లతో ఒక సంవత్సరం నాక్స్ సూట్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్: కంపెనీ ఈ రెండు మొబైల్స్‌పై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. అంతేకాక ఏడాది పాటు డివైజ్ సేఫ్టీ, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ మేనేజ్‌మెంట్ (EMM) కోసం 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లతో ఒక సంవత్సరం నాక్స్ సూట్ (Knox Suite) సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఎంటర్ప్రైజ్ కస్టమర్‌లు రెండో సంవత్సరం నుంచి 50 శాతం తగ్గింపు ధరతో నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు.
కంపెనీ వీటికి ఏడేళ్ల OS అప్‌డేట్‌లు కూడా అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఈ మొబైల్స్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, చాట్ అసిస్ట్ వంటి 'గెలాక్సీ AI' ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.
'గెలాక్సీ S24' మోడల్ ఫీచర్లు:
- డిస్ప్లే: 6.2-అంగుళాల ఫుల్ HD+
- బ్యాటరీ: 4,000 mAh
- కెమెరా సెటప్: ఈ మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ వైడ్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
'గెలాక్సీ S24 అల్ట్రా' మోడల్ ఫీచర్లు:
- డిస్ప్లే: 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్
- రిఫ్రెష్ రేట్: 1-120 Hz అడాప్టివ్
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8-Gen 3 చిప్‌సెట్
- బ్యాటరీ: 5,000 mAh
- కెమెరా సెటప్: S24 అల్ట్రా 200MP ప్రైమరీ వైడ్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 10MP అండ్ 50MP రిజల్యూషన్‌ల రెండు టెలిఫోటో లెన్స్‌లతో జత అయి ఉంటుంది.
ధర:
- ఇండియాలో స్పెషల్ ఎడిషన్ 'S24' మోడల్ ధరను రూ.78,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లో 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
- మరోవైపు 'S24 అల్ట్రా' 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.96,749. ఇది టైటానియం బ్లాక్ షేడ్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌లను బ్రాండ్ కార్పొరేట్+ ప్రోగ్రామ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
గూగుల్ సెర్చ్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్- ఈ ఏడాది ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా?
మరణాన్ని ఆపగలికే క్లాక్..!- దీనితో 'డెత్ డేట్' తెలుసుకో.. తలరాతను మార్చుకో..!
వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్ఫుల్ బాస్- దీని స్పీడ్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!