Samsung AI Features: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తూ తమ ఫోన్లలో కొత్తగా ఏఐ ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్లలో ఏఐ ఫీచర్లు వచ్చే ఏడాది వరకూ మాత్రమే ఫ్రీగా అందిస్తామని ప్రకటించింది. ఆపై 2025 చివరి నుంచి ఈ ఏఐ ఫీచర్లు పొందాలంటే ఎస్24 సిరీస్ మొబైల్స్ వినియోగదారులు ఎక్స్ట్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
శాంసంగ్ ఈ ఏడాది జనవరిలో తన ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్స్‌లో తొలిసారి ఏఐ ఫీచర్లను జత చేసింది. శాంసంగ్ అప్పట్లో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనే 2025 చివరి వరకు కొన్ని ఫీచర్లను ఫ్రీగా అందిస్తామని పేర్కొంది. ఇటీవల గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ లాంచ్ సందర్భంలోనూ 2025 చివరి నుంచి కొన్ని ఏఐ ఫీచర్లకు ఫీజు ఉంటుందని తెలిపింది. మరొక ఏడాది పాటు మాత్రమే ఏఐ ఫీచర్లు ఫ్రీగా అందించబోతున్నట్లు స్పష్టం చేసింది. మున్ముందు ఏ సిరీస్ ఫోన్లకు కూడా ఏఐ ఫీచర్లను తీసుకురానున్నారు.
శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఫీచర్ల ప్రత్యేకతలు: శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఫీచర్లలో ఈజీగా నావిగేషన్ చేయొచ్చు. శాంసంగ్ అందించిన ఏఐ ఫీచర్లలో నోట్ అసిస్టెంట్ ముఖ్యమైంది. దీంతో మాట్లాడే కాల్స్ వాయిస్ ట్రాన్స్ లేట్ చేయొచ్చు. గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ లాగా Galaxy AI ఫోటో సాయంతో వస్తువులను తొలగించడం లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. వీటితోపాటు సర్కిల్ టూ సెర్చ్, పీడీఎఫ్ టెక్ట్స్ ట్రాన్స్ లేట్ తదితర ఫీచర్లు ఎస్24 సిరీస్ మొబైల్స్‌లో ఉన్నాయి. మరి వీటిలో ఏ ఫీచర్లకు ఫీజు వసూలు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఏఐ ఫీచర్లతో గ్లోబల్‌గా లాంచైన శాంసంగ్ S24 FE - ధర ఎంతంటే? - Samsung Galaxy S24 FE