Free Repair for Mobiles: పండగ వేళ ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన యూజర్స్‌కు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఎంపిక చేసిన పలు మోడల్ వన్‌ప్లస్ మొబైల్స్‌కు జీవిత కాలం పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. డిస్ ప్లే సమస్యలు ఉన్నవారు సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఫ్రీగా మార్పించుకోవచ్చుని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఇండియాలోని వినియోగదారులకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది.
ఆ కారణంగానే: గత కొన్ని నెలల నుంచి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యంగా OnePlus 8, OnePlus 9 సిరీస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కంప్లయింట్స్ వస్తున్నాయి. OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డివైజ్ మదర్‌బోర్డ్ ఫెయిల్యూర్, డిస్‌ప్లేలో గ్రీన్ లైన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు యూజర్స్ క్లెయిమ్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన కంపెనీ యూజర్స్‌కు స్క్రీన్ రిలేటెడ్ సమస్యల వల్ల కలిగే అసౌకర్యంపై పరిష్కారాన్ని ప్రకటించింది.
యూజర్స్ నుంచి కంప్లయింట్స్ రావటంతో కంపెనీ.. మొబైల్స్‌లో వస్తున్న సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో OnePlus 8, OnePlus 9 సిరీస్ మొబైల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి ఫ్రీ రిజల్యూషన్, లైఫ్‌టైమ్ వారంటీని ప్రకటించింది. ఇందుకోసం సమీపంలోని వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్లను సందర్శరించమని తెలిపింది. అక్కడ మొబైల్లో ఉన్న సమస్యలను గుర్తించి ఫ్రీ రిజల్యూషన్‌ను అందిస్తారని వన్‌ప్లస్ హామీ ఇచ్చింది.
దీంతోపాటు వన్‌ప్లస్ ఎంపిక చేసిన వన్‌ప్లస్ 8, 9 సిరీస్ డివైజెస్‌కు అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. సర్వీస్ సెంటర్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఎఫెక్టెడ్ మొబైల్స్‌కు లైఫ్‌టైమ్ స్క్రీన్ వారంటీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఫోన్ ఎంత పాతది అయినా సరే గ్రీన్ లైన్ ప్లాబ్లమ్ ఉంటే వెంటనే పరిష్కారం కోసం సమీపంలో వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించొచ్చని చెప్పింది. ఇందులో డిస్ప్లే రీప్లేస్‌మెంట్‌తో లైఫ్‌టైమ్ డిస్ప్లే వారంటీ, కొత్త మొబైల్స్‌కు అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టొయోటా ఫెస్టివల్ స్పెషల్ ఎడిషన్ లాంచ్- లిమిటెడ్ సేల్స్.. వెంటనే త్వరపడండి..!
లిమిటెడ్ యాడ్స్‌తో యూట్యూబ్ ప్రీమియం లైట్- ఇకపై యూజర్స్‌కు పండగే..!