ETV Bharat / technology

మీ ఐఫోన్​లో యాప్స్ స్వైప్ చేస్తున్నారా? బ్యాటరీ లైఫ్, ఫోన్ స్పీడ్ ఢమాల్​! - Leaving Apps Drain Battery Iphone - LEAVING APPS DRAIN BATTERY IPHONE

Iphone Apps Swipe Decrease Battery Life : మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఐఫోన్​లో యాప్​లను స్వైప్ చేయడం వల్ల దాని బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుందట. అంతేగాక ఆ ప్రభావం ఫోన్ స్పీడ్​పై కూడా పడుతుందట.

Iphone Apps Swipe Decrease Battery Life
Iphone Apps Swipe Decrease Battery Life
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 6:38 PM IST

Iphone Apps Swipe Decrease Battery Life : ఐఫోన్​ను చాలా మంది స్టేటస్ సింబల్​గా భావిస్తుంటారు. అంతేగాక ఐఫోన్ చాలా సెక్యూర్​గా ఉంటుందని కూడా చెబుతుంటారు. అయితే ఐఫోన్​లో యాప్​లను వాడిన తర్వాత స్వైప్ చేస్తే దాని బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుందట. ఎందుకిలా జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదివాల్సిందే.

సాధారణంగా ఎవరైనా వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర యాప్​లను ఓపెన్ చేసిన తర్వాత యాప్​ను క్లోజ్ చేసేందుకు స్వైప్ చేస్తారు. ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. కానీ ఇది నిజం కాదట. మీరు ఐఫోన్ లో వాడిన యాప్​లలో దేనినైనా క్లోజ్ చేయడానికి స్వైప్ చేయకూడదట. ఎందుకంటే అలా చేయడం వల్ల మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతినడమేకాక ఫోన్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఈ విషయంపై యాపిల్ సంస్థ సైతం స్పందించింది.

యాపిల్ సంస్థ ఏమందంటే?
'ఏదైనా యాప్​ను వాడి ఆపేయాలనుకంటే స్వైప్ చేయవచ్చు. కానీ కొన్ని నిమిషాల తర్వాతే మళ్లీ ఆ యాప్​నే ఓపెన్ చేయాలనుకుంటే క్లోజ్ చేయకపోవడమే బెటర్. మీరు మీ యాప్​లను క్లోజ్ చేయడానికి స్వైప్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఐఫోన్ బ్యాటరీ లైఫ్, ఫోన్ స్పీడ్ తగ్గుతుంది' అని యాపిల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

యాప్‌లు బ్యాక్‌ గ్రౌండ్​లో బ్యాటరీని ఖాళీ చేస్తాయనుకుంటారు. కానీ ఇది ఐఫోన్ విషయంలో కరెక్ట్ కాదట. యాపిల్ ఐఓఎస్, చిప్స్ బ్యాక్‌ గ్రౌండ్ టాస్క్​లను సమర్థంగా నిర్వహిస్తాయి. అయితే మీరు ఇప్పటికే ఉపయోగించిన యాప్​లను ఓపెన్ చేయాలంటే వెంటనే అవి లోడ్ అవుతాయి. మీరు యాప్​ను ఓపెన్ చేసి మళ్లీ దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఐఫోన్ మొదటి నుంచి యాప్​ను రీలోడ్ చేస్తుంది. అందుకే మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్​ను పెంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

  • లేటెస్ట్ సాఫ్ట్‌ వేర్​కు ఫోన్ అప్డేట్ చేయండి
  • ఆటో బ్రైట్ నెస్​ను పెట్టుకోండి
  • మీ ఐఫోన్ వైఫైని ఎల్లవేళలా ఆన్​లో ఉంచండి
  • లొకేషన్ సర్వీసెస్​ను ఆఫ్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.