ETV Bharat / technology

రైల్వే ప్రయాణికుల కోసం 'సూపర్ యాప్'- అన్ని సౌకర్యాలు ఒకే చోట- ఇక నో టెన్షన్ బాస్..! - INDIAN RAILWAYS SUPER APP

ఇండియన్ రైల్వేస్ సరికొత్త యాప్- ఇకపై ఆ సమస్యలకు చెక్​..!

Indian Railways
Indian Railways (ANI)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 4, 2024, 5:29 PM IST

Indian Railways Super App: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్​న్యూస్. ఇకపై అన్ని రకాల సదుపాయాలూ ఒకే చోట ఉండేలా ఇండియన్ రైల్వే సరికొత్త యాప్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఒకే యాప్​లో టికెట్ బుకింగ్, లైవ్ లొకేషన్, ఫుడ్ సైతం బుక్​ చేసుకునే వెసులు బాటు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం రైల్వేకు సంబంధించి వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్‌, వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్, అన్‌ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్‌ యాప్‌, ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్‌ ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌, ఫిర్యాదులు, ఫీడ్‌ బ్యాక్‌ కోసం రైల్‌ మదద్‌ వంటి యాప్స్‌ ఉన్నాయి. ఇదికాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవడానికి నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ ఉంది.

అయితే ఒక్కోదానికి ఇలా ఒక్కో యాప్​లను ఉపయోగించాల్సి రావడంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్​ సరికొత్తగా సూపర్​ యాప్​ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుక్కింగ్, పీఎన్ ఆర్ స్టేటస్, ట్రాకింగ్ సిస్టమ్ వంటి వేర్వేరుగా ఉన్న సేవలన్నీ ఈ సూపర్‌ యాప్‌ ద్వారా ఒకచోట చేర్చనున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు.

రైల్వేకు సంబంధించిన ఈ సూపర్‌ యాప్‌ను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే ఈ యాప్ సిద్ధమైందని, ప్రస్తుతం దీన్ని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC)తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఇంగ్లీష్ మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఈ సూపర్ యాప్​ను ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లనూ ఒకేచోట బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాక దీని ద్వారా ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దీనికోసం చాలామంది థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఈ యాప్​ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలు ఈజీ కానున్నట్లు తెలుస్తొంది.

కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా?- ఈ యాప్​తో మీ ప్రయాణం చాలా ఈజీ బాస్..!

పిచ్చెక్కించే ఫీచర్లతో వన్​ప్లస్, ఐక్యూ మొబైల్స్​- వీటిలో ఏది బెస్ట్ అంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.