ETV Bharat / technology

లాగిన్ కాకుండానే ChatGPT వాడాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use ChatGPT Without Login - HOW TO USE CHATGPT WITHOUT LOGIN

How To Use ChatGPT Without Login : మీరు చాట్​జీపీటీ వాడుతుంటారా? ఇందుకోసం ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేశారా? అయితే ఇది మీ కోసమే. మీరు చాట్​జీపీటీలోకి లాగిన్ కాకుండానే, దానిని వాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

How To Use ChatGPT Without Login
ChatGPT usage tips (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 12:05 PM IST

How To Use ChatGPT Without Login : ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(AI)కు ఫుల్ డిమాండ్ ఉంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యంగా ఓపెన్‌ ఏఐ కంపెనీ తీసుకొచ్చిన 'చాట్‌జీపీటీ'ని చాలా మంది వినియోగిస్తున్నారు. కొత్త యూజర్లు ఈ టూల్ వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చాట్‌ జీపీటీ ఉపయోగించేందుకు అకౌంట్‌ క్రియేట్ చేసి, సైన్‌ ఇన్‌ కావాల్సిన అవసరం లేదు. లాగిన్ కాకుండానే ఎవరైనా చాట్‌జీపీటీ వాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

అకౌంట్ అవసరం లేదు!
ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్ లేకుండానే చాట్​జీపీటీను వాడుకోవచ్చు. అంతకుముందు యూజర్స్ ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఉపయోగించి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ ప్లాట్​ఫామ్స్​ ద్వారా చాట్ జీపీటీలో సైన్-ఇన్ చేయాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ ఏఐ ఏప్రిల్ 1 నుంచి చాట్​జీపీటీ 3.5ను రోల్​అవుట్ చేసింది. ఈ చాట్​జీపీటీ వెర్షన్​లో మీరు సైన్-ఇన్‌ చేయకుండానే, నేరుగా దానిని వాడుకోవచ్చు. అయితే చాట్​జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే వాయిస్ చాట్స్, పర్సనలైజ్డ్ ఇన్​స్ట్రక్షన్స్​ లాంటి అదనపు సేవలు పొందగలుగుతారు. మిగతావారికి ఈ సేవలు అందుబాటులో ఉండవు.

ఏదిఏమైనప్పటికీ, ఈ చాట్​జీపీటీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సున్నితమైన సమాచారాన్ని ఈ ఏఐ చాట్​బాట్​తో పంచుకోకూడదు. ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన లేటెస్ట్ చాట్​జీపీటీ 4 లేదా DALL-E లు ఉపయోగించాలంటే మాత్రం, కచ్చితంగా చాట్​జీపీటీ అకౌంట్​లో లాగిన్ కావాల్సి ఉంటుంది.

అకౌంట్ లేకుండానే చాట్ జీపీటీని వాడడం ఎలా?

  • మొదట వెబ్ బ్రౌజర్​లో 'చాట్ జీపీటీ 3.5'ను సెర్చ్ చేయాలి.
  • చాట్​జీపీటీ వెబ్​సైట్​లోని అడ్రస్ బార్​లో www.chat.openai.com అని టైప్ చేసి ఎంటర్ చేయాలి.
  • వెబ్‌సైట్‌ ఓపెన్ కాగానే 'న్యూ చాట్ సెషన్‌' ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • వెంటనే ఒక కొత్త ఇంటర్​ఫేస్ ఓపెన్ అవుతుంది. దానిలో లాగిన్/ అకౌంట్ క్రియేట్​ ఆప్షన్​లు ఏవీ ఉండవు.
  • మీరు నేరుగా చాట్​ బాక్స్​లో టైప్​ చేసుకోవచ్చు.
  • మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ బటన్ నొక్కాలి.
  • వెంటనే మీకు చాట్​ జీపీటీ రిప్లై ఇస్తుంది.
  • ఈ విధంగా మీరు సైన్​-ఇన్ కాకుండానే చాట్​జీపీటీ వాడుకోవచ్చు.

అవి కావాలంటే అకౌంట్ ఉండాల్సిందే!

  • మీరు ఇది వరకే సేవ్​​ చేసుకున్న చాట్​లను మళ్లీ చూడాలంటే, కచ్చితంగా చాట్​జీపీటీలోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.
  • హిస్టరీ చూడాలంటే కూడా తప్పనిసరిగా చాట్​జీపీటీలోకి లాగిన్​​ కావాలి.

Gmailలో లార్జ్​ ఫైల్స్ పంపించాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - How To Send Large Files In Gmail

హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్​ మీ కోసమే! - How To Protect Wifi From Hackers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.