ETV Bharat / technology

మీ స్మార్ట్​ఫోన్​లో తరచూ యాడ్స్ కనిపిస్తున్నాయా? డోంట్ వర్రీ - సింపుల్​గా వాటిని టర్న్​ ఆఫ్ చేసేయండిలా! - How To Stop Ads On Android Mobile

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 12:13 PM IST

How To Stop Ads On Android Mobile : మీ ఆండ్రాయిడ్ ఫోన్​లో విపరీతంగా యాడ్స్​ వస్తున్నాయా? ఏ యాప్ ఓపెన్ చేసినా క్లికబుల్​/ పాప్​-అప్​ యాడ్స్​ కనిపిస్తున్నాయా? డోంట్ వర్రీ. మీ మొబైల్​లో వచ్చే అనవసరమైన యాడ్​లను ఎలా రిమూవ్ చేయాలో ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసకుందాం.

How to Get Rid of Ads on Android Phone
How to block ads on Android devices in 2024 (ETV Bharat)

How To Stop Ads On Android Mobile : మొబైల్ ఫోన్​లో వచ్చే యాడ్స్ మనల్ని చీకాకు పెడుతూ ఉంటాయి. ఏ యాప్​ ఓపెన్ చేసినా, ముందుగా యాడ్స్​ కనిపిస్తూ, మన పనులకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం, మనకు తెలియకుండానే, మన ఫోన్​లో కొన్ని యాప్స్ ఇన్​స్టాల్ అవుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా మనకు కనిపించవు. ఇవి మన ఆండ్రాయిడ్​ ఫోన్​లో ఆటోమేటిక్​గా యాడ్స్ వచ్చేలా చేస్తాయి. అందుకే ఇలాంటి వాటిని ఎలా సింపుల్​గా రిమూవ్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

మొదటి పద్ధతి : How To Turn Off Ads On Any Smartphone

  • ముందుగా మీ ఫోన్​లోని Settings ను ఓపెన్ చేయండి.
  • సెట్టింగ్స్​లో Apps పై క్లిక్ చేయండి.
  • తరువాత App managementపై క్లిక్ చేయండి.
  • వెంటనే మీ మొబైల్ ఫోన్​లో ఇన్​స్టాల్ అయ్యున్న యాప్స్​ అన్నీ అక్కడ కనిపిస్తాయి. కానీ కొన్ని యాప్స్​ మాత్రం కనిపించకుండా ఉంటాయి.
  • ఇలా కనిపించని యాప్స్​ను చూడాలంటే, మీ మొబైల్​ను డార్క్ మోడ్​లోకి మార్చుకోవాలి.
  • అప్పుడు App managementలో ఉన్న సీక్రెట్ లేదా హిడెన్​ యాప్​లు​ మనకు కనిపిస్తాయి. వైట్​ మోడ్​లో ఫోన్ ఆపరేట్ చేసేవారికి ఇలాంటి హిడెన్ యాప్​లు కనిపించవు. ఎందుకంటే వీటికి ఎలాంటి ఐకాన్​లు ఉండవు.
  • ఇప్పుడు మీరు ఆ సీక్రెట్/ హిడెన్​​ యాప్​పై క్లిక్ చేయాలి. కానీ వెంటనే దానిని అన్​ఇన్​స్టాల్ చేసేయకూడదు.
  • ముందుగా Storage usageపై క్లిక్ చేసి clear data, cache లను పూర్తిగా తొలగించాలి. ఆ తరువాత మాత్రమే దానిని అన్​ఇన్​స్టాల్ చేయాలి.
  • కానీ ఇక్కడితో పని అయిపోలేదు. ఇలాంటి హిడెన్ యాప్​లను పర్మినెంట్​గా మీ ఫోన్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది మళ్లీ అటోమేటిక్​గా ఇన్​స్టాల్ అయిపోతుంది.
  • అందుకే మీరు ఈ హిడెన్ యాప్​ ఎక్కడ డౌన్​లోడ్ అయ్యుందో తెలుసుకోవాలి. ఇందుకోసం మీ File managerను ఓపెన్ చేయండి.
  • ఇందులో Apps లోకి వెళ్తే, అక్కడ ఈ హిడెన్ యాప్​ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కూడా కనిపించకపోతే, Downloadsలోకి వెళ్లి చూడాలి.
  • ఐకాన్​ లేని యాప్​లు మీకు కనిపిస్తాయి. వీటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి.
  • దీనితో ఈ హిడెన్ లేదా సీక్రెట్ యాప్​ మీ మొబైల్ నుంచి పర్మినెంట్​గా డిలీట్ అయిపోతుంది.
  • కానీ ఇక్కడితో దీని పని అయిపోదు. మనకు ఈ హిడెన్ యాప్​ ఏ అప్లికేషన్ ద్వారా మొబైల్​లోకి డౌన్​లోడ్ అయ్యిందో తెలుసుకోవాలి.
  • కానీ ఇది చాలా కష్టమైన పని. అందుకే మీ మొబైల్​లో మీరు వాడని యాప్​లు అన్నింటినీ డిలీట్ చేయాలి. ప్లేస్టోర్ నుంచి కాకుండా, థర్డ్ పార్టీ యాప్​ల నుంచి డౌన్​లోడ్ చేసుకున్న యాప్​లను కూడా పూర్తిగా అన్​ఇన్​స్టాల్ చేసేయండి.
  • ఈ విధంగా మీ మొబైల్​లో వచ్చే పాప్​అప్​ యాడ్స్​ను పూర్తిగా రిమూవ్​ చేసుకోవచ్చు.

రెండో పద్ధతి : How To Stop Unwanted Pop-up Ads On Android

  • మీ ఫోన్​లో ఉన్న హిడెన్ యాప్​లను కనుగొనేందుకు మరో మార్గం కూడా ఉంది.
  • ఇందుకోసం మీరు Settings లోకి వెళ్లి About Phone లేదా About Device పై క్లిక్ చేయాలి.
  • తరువాత Versionపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు Build number లేదా MIUI version అని కనిపిస్తుంది. దానిపై 7 సార్లు ట్యాప్​ చేయాలి.
  • వెంటనే మీ మొబైల్​లో డెవలపర్​ ఆప్షన్స్​ యాక్టివేట్ అవుతాయి. దీని ద్వారా కూడా మీ మొబైల్​లోని హిడెన్ అప్లికేషన్లను కనుక్కోవచ్చు.
  • ఇందుకోసం మీరు Additional settings లోకి వెళ్లి Developer Options పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు Running Services అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీ మొబైల్ బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఐకాన్​ లేని హిడెన్​ అప్లికేషన్లు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మీ మొబైల్​లో ఉన్న సీక్రెడ్ లేదా హిడెన్​ యాప్​లను సులువుగా గుర్తించవచ్చు. వీటిని రిమూవ్ చేయాలంటే, మళ్లీ App managementలోకి వెళ్లి, మొదటి పద్ధతిలో చెప్పిన విధంగా అన్​ఇన్​స్టాల్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్​లో వస్తున్న యాడ్​లను చాలా సులువుగా ఆపేయవచ్చు.

స్పామ్ కాల్స్​/మెసేజ్​లతో విసిగిపోయారా? ట్రాయ్ DND యాప్​లో ఫిర్యాదు చేయండిలా! - How To Complain About Spam Calls

ఇన్​స్టాలో మీ కంటెంట్​కు ఎక్కువ వ్యూస్​ రావాలా? ఈ టాప్​ AI ఇన్ఫోగ్రాఫిక్స్​ టూల్స్​​ ట్రై చేయండి! - Best AI Tools Infographics

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.