ETV Bharat / technology

ఎయిర్​పాడ్స్​ను క్లీన్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - How To Clean AirPods Safely - HOW TO CLEAN AIRPODS SAFELY

How To Clean AirPods Safely : మీ ఎయిర్​పాడ్స్​కు దుమ్ము, ధూళి పట్టాయా? ఇంటి వద్దనే వాటిని శుభ్రం చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇంటి వద్దనే ఎయిర్​పాడ్స్​ పాడవకుండా, ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Clean AirPods Cases
How To Clean AirPods Safely
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 12:15 PM IST

How To Clean AirPods Safely : ప్రస్తుత కాలంలో ఫోన్​ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఇయర్​ ఫోన్స్ లేదా ఎయిర్​పాడ్స్​ను వినియోగిస్తున్నారు. చేతిలో ఫోన్​ ఉన్నట్లే చాలా మంది చెవులకు ఎయిర్​పాడ్స్ ఉంటున్నాయి. అయితే చాలా మంది వాటిని వాడడమే తప్ప వాటి శుభ్రతపై దృష్టి సారించరు. ఎయర్​పాడ్స్​లో దుమ్ము, ధూళి చేరితే అవి వేగంగా పాడైపోతాయి. అంతేకాదు సౌండ్ క్లారిటీ లేక యూజర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎయిర్​పాడ్స్​ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాటి లైఫ్​స్పాన్ పెరుగుతుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఎయిర్​పాడ్స్ ఎలా శుభ్రం చేయాలి? క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

What To Avoid When Cleaning AirPods :
యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్​పాడ్స్ చిన్న సైజులో, చాలా సున్నితంగా ఉంటాయి. కనుక వాటిని శుభ్రపరచడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఈ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్​ (ఎయిర్​పాడ్స్) చాలా ఖరీదైనది. కనుక వీటిని శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎయిర్​పాడ్స్​ను శుభ్రం చేయడానికి పిన్​లు లేదా సూదులు లాంటి వాటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి స్పీకర్లలోని సున్నితమైన భాగాలను దెబ్బతీస్తాయి. అలాగే నీళ్లతో ఎయిర్​పాడ్స్​ను క్లీన్ చేయకూడదు. బ్లీచింగ్ పౌడర్​, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ కూడా వాడకూడదు.

ఎయిర్​పాడ్స్​ను ఎలా క్లీన్ చేయాలంటే?

  • ఎయిర్​పాడ్స్​ను శుభ్రం చేయడానికి దూది(కాటన్), టూత్‌పిక్, డెంటల్ ఫ్లొస్ స్టిక్ , ఐసోప్రొపైల్ ఆల్కహాల్, లాండ్రీ సబ్బు, పొడి గుడ్డ, గోరువెచ్చని నీళ్లు ఉపయోగించాలి.
  • ఎయిర్​పాడ్స్​ శుభ్రం చేయడానికి ముందు వాటిని ఇతర డివైజ్​ల నుంచి డిస్​కనెక్ట్ చేయాలి. తరువాత వాటిని ఆఫ్ చేయాలి. ఆ తరువాత మాత్రమే పొడిగుడ్డతో దానిని ఉపరితలాన్ని శుభ్రంగా తుడవాలి.
  • మెత్తటి కాటన్​ గుడ్డను నీటిలో ముంచి ఎయిర్​పాడ్స్ బయట సున్నితంగా తుడవాలి. ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్​లో తేమ చేరకుండా చూసుకోవాలి. ఎందుకంటే తేమ చేరితే ఎయర్​పాడ్స్ లోపలి భాగాలు దెబ్బతింటాయి.
  • తడి బట్టతో తుడిచిన తరువాత ఎయిర్​పాడ్స్​ను పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. ఈ తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఎయిర్​పాడ్స్​ను ఇతర డివైజ్​లతో కనెక్ట్ చేయకూడదు.
  • ఇయర్​బడ్స్​ను ఐసోప్రొపైల్​ ఆల్కహాల్​లో ముంచి, స్పీకర్ గ్రిల్స్​ను, మెష్‌ను సున్నితంగా క్లీన్ చేయాలి.
  • స్పీకర్ గ్రిల్స్, మైక్ అవుట్ లెట్స్​, ఛార్జింగ్ పాయింట్స్​ చాలా చిన్నగా ఉంటాయి. వాటిలోపల కూడా దుమ్ము ఉండే అవకాశం ఉంది. కనుక క్లాత్​తో తుడవడానికి వీలుపడదు. మెత్తటి బ్రష్ లేదా చిన్న సిలికాన్ పేస్ట్రీ బ్రెష్ సాయంతో వాటిని క్లీన్ చేయండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉండి, చాలా తేలికగా ఎయిర్​బడ్స్​ను క్లీన్ చేసుకోవచ్చు.

రూ.2వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smart Watch Under 2000

యాపిల్ యూజర్స్​కు గుడ్ న్యూస్ - ఇకపై పాత ఫోన్‌ పార్ట్స్‌తో రిపేర్‌! - Apple Expands Repair Options

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.