Best Earbuds Under 2000 : ఈ స్మార్ట్ యుగంలో చాలా మంది వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీలు అన్నీ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరి మీరు కూడా రూ.2000లోపు మంచి ఇయర్‌బడ్స్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్‌లో మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం.
1. Wings Phantom 410 Specifications : ఈ మోడల్ ఎయిర్ బడ్స్ 5.2 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను పెట్టుకుని 10 మీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్లో మాట్లాడవచ్చు. పాటలను వినవచ్చు. అలాగే దీనికి ఆటో పెయరింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ను మొబైల్ ఫోన్, పీసీ, ట్యాబెట్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
- బ్రాండ్- వింగ్స్
- డిజైన్- ఇన్ఇయర్ కెనాల్ ఫోన్
- బరువు- 150 గ్రాములు
- బ్యాటరీ టైప్- Li-ion
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ
- ధర- రూ.1,532
2. OPPO Enco Buds 2 Specifications : ఒప్పో ఎన్కో బడ్స్ 2లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. దీంతో మీరు మరింత హ్యాపీగా సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది.
- బ్రాండ్- ఒప్పో
- డిజైన్- ఎన్కో బడ్స్ 2
- వారంటీ- ఒక సంవత్సరం
- బ్లూటూత్- 5.2 వెర్షన్
- ప్లేబ్యాక్ టైమ్- 28గంటలు
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ టైప్-సి
- ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
- ధర- రూ.1,799
3. Boat Airdopes 141 ANC Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 42 గంటలు పనిచేస్తాయి. గంటన్నరలో ఈ ఇయర్డోబ్స్ ఫుల్ ఛార్జింగ్ అవుతాయి. ఆటో పెయిరింగ్ ఆప్షన్ ఈ ఎయిర్‌బడ్స్‌లో ఉంది. మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్స్కు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. 10 మీటర్ల ఆటో పెయరింగ్ ఆప్షన్ ఉంది.
- బ్రాండ్ - బోట్
- మోడల్- ఎయిర్ పాడ్స్ 141 ఏఎన్సీ
- వారంటీ- 1 సంవత్సరం
- బ్యాటరీ టైప్- Li-ion
- ప్లేబ్యాక్ టైమ్- 42 గంటలు
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ టైప్-సి
- ధర- రూ.1,599
4. Realme Buds Q2 Neo Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌కు ఒక సంవత్సరం వారెంటీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు మాట్లాడుకోవచ్చు. ఆటో పెయిరింగ్ ఆప్షన్ కూడా ఉంది.
- బ్రాండ్- రియల్ మీ
- మోడల్- బడ్స్ క్యూ 2 నియో
- బ్యాటరీ టైప్- Li-ion
- ప్లే బ్యాక్ టైమ్- 20 గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 480 mAh
- ఛార్జింగ్ టైమ్- 2గంటలు
- ధర- రూ.1,598
5. OnePlus Nord Buds 2R Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌ను మొబైల్ ఫోన్, పీసీ, ట్యాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది.
- బ్రాండ్- వన్ ప్లస్
- మోడల్- వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్
- వారంటీ- 1 సంవత్సరం
- ప్లే బ్యాక్ టైమ్- 20 గంటలు
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ టైప్-సీ
- ధర- రూ.1,998
6. Jlab Go Air Pop Specifications : ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 32 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది. రెండు గంటల ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఈ ఇయర్‌బడ్స్ స్వెట్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌కు రెండేళ్ల వారెంటీ ఉంది.
- బ్రాండ్- జ్లాబ్
- మోడల్- గో ఎయిర్ పోప్
- వారంటీ- 2 సంవత్సరాలు
- స్టాండ్ బై టైమ్- 60 గంటలు
- బ్యాటరీ టైప్- Li-Polymer
- ధర- రూ.1,649
7. Blaupunkt BTW07 ANC Moksha Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్ ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తాయి. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. మొబైల్, పీసీ, ట్యాబ్లెట్‌కు సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.
- బ్రాండ్- బ్లౌపున్కట్
- మోడల్- BTW07 ANC మోక్ష
- బ్యాటరీ టైప్- Li-Polymer
- ప్లేబ్యాక్ టైమ్- 40 గంటలు
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ
- ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
- ధర- రూ.1,999
8. Noise Buds VS104 Pro Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 33.5 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. వీటికి అదనంగా 5.2 బ్లూటూత్ కనెక్టివిటీ ఈ ఎయిర్‌బడ్స్‌లో ఉంది.
- బ్రాండ్- నోయిస్
- మోడల్- బడ్స్ వీస్ 104 ప్రో
- వారంటీ- ఒక సంవత్సరం
- ఛార్జింగ్ టైప్- యూఎస్బీ టైప్-సి
- ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
- ధర- రూ.1,699
9. PTron Zenbuds Pro1 Max Specifications : ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది. టైప్-సీ ఛార్జింగ్, 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా దీనిలో ఉంది.
- బ్రాండ్- పీట్రాన్
- మోడల్- జెన్ బడ్స్ ప్రో1 మ్యాక్స్
- వారంటీ- ఒక సంవత్సరం
- ఛార్జింగ్ - యూఎస్బీ
- ధర- రూ.1,673
10. Hungama HiLife Bounce 101 Specifications : ఈ మోడల్ ఇయర్ బడ్స్‌ను మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వారెంటీ ఉంది. దీంతో పాటు 5 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది.
- బ్రాండ్- హంగామా హైలైఫ్
- మోడల్- బౌన్స్ 101
- వారంటీ- ఒక సంవత్సరం
- బ్యాటరీ టైప్- Li-ion
- ప్లే బ్యాక్ టైమ్- 30 గంటలు
- ఛార్జింగ్ టైమ్- 90 గంటలు
సైబర్ నేరగాళ్లు మీ ఐడెంటిటీని దొంగిలిస్తారు - పారా హుషార్! - What Is Identity Theft
మీ ఐఫోన్‌కు 2 జతల AirPods కనెక్ట్ చేసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - AirPods Share Audio Feature