ETV Bharat / technology

త్వరలో మార్కెట్లోకి యాపిల్​ స్మార్ట్​ గ్లాసెస్​- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..! - APPLE SMART GLASSES

మార్కెట్లో యాపిల్​ జోరు- స్మార్ట్​ గ్లాసెస్​ తీసుకొచ్చేందుకు కసరత్తు

Apple Smart Glasses Like Meta
Apple Smart Glasses Like Meta (Apple)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 15, 2024, 4:10 PM IST

Apple Smart Glasses Like Meta: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ మంచి జోరు మీద ఉంది. ఇటీవలే తన ఐఫోన్​ 16 సిరీస్​ లాంచ్ చేసి భారీ విక్రయాలతో దూసుకుపోతున్న సంస్థ తాజాగా కొత్త ప్రయోగానికి తెర తీయనుంది. మెటా సంస్థ తీసుకొచ్చిన రేబాన్ వంటి స్మార్ట్​ గ్లాసెస్​ను తీసుకొచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు బ్లూమ్స్​ బర్గ్​ మార్క్ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. యాపిల్ త్వరలోనే స్మార్ట్​ గ్లాసెస్​ కెమెరాతో ఎయిర్​ పాడ్స్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్​ గ్లాసెస్ ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. త్వరలోనే వీటి రిలీజ్​పై ఒక క్లారిటీ రానుందని బ్లూమ్స్​ బర్గ్​ మార్క్ చెప్పుకొచ్చింది. 2027లో ఈ యాపిల్ స్మార్ట్ గ్లాసెస్​ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది.

కాగా గతేడాది మెటా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఐ ఫీచర్లతో రేబాన్ స్మార్ట్​ గ్లాసెస్​ను తీసుకొచ్చింది. ఇప్పుడు యాపిల్​ కూడా రేబాన్​ గ్లాసెస్​ మాదిరిగానే సన్​ గ్లాసెస్​ తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హై టెక్నాలజీని ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ సన్​ గ్లాసెస్​లో కెమెరాలతో పాటు స్పీకర్లు, మైక్రోఫోన్స్ సైతం పరిచయం చేసేందుకు యాపిల్ కసరత్తు చేస్తోంది.

యాపిల్ ఈ సన్ గ్లాసెస్​లో ఆగ్మెంటెడ్ రియాలిటీ డిస్‌ప్లేను సైతం అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ రియాలిటీ విజువల్ ఇంటెలిజెన్స్​ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితమే యాపిల్ సంస్థ కెమెరాతో ఇయర్ బర్డ్స్​ను తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఈ కెమెరా ఇయర్ బర్డ్స్ పైన కనిపించే అవకాశం ఉందని, ఈ డిజైన్ గోప్యతను ఛాలెంజ్ చేసే విధంగా ఉందని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ డిజైన్ ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ సన్ గ్లాసెస్ పై యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

కాగా యాపిల్ ఈ ఏడాది ప్రారంభంలో విజన్ ప్రో ఏఆర్​ హెడ్​సెట్​ను ప్రారంభించి ఆర్మెంటెడ్​ రియాలిటీ (AR) లోకి అడుగు పెట్టింది. దీని సేల్స్ ప్రారంభంలో ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ దాని స్టార్టింగ్​ ప్రైజ్ రూ.2.94 లక్షలు కావటంతో రాను రానూ దాని విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో ఖర్చులను కవర్ చేసేందుకు కంపెనీ చాలా కష్టపడాల్సి వచ్చింది.

విజన్ ప్రో AR హెడ్‌సెట్స్: యాపిల్ విజన్ ప్రో విజువల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తన ఇతర ప్రొడక్ట్స్​లో సైతం చేర్చాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్​గ్లాస్​తో పాటు యాపిల్​ విజన్​ ప్రొడక్ట్స్​ గ్రూప్ తన మొదటి విజన్ ప్రో ఏఆర్​ హెడ్​సెట్​ను అభివృద్ధి చేసింది. కెమెరాలతో కూడిన కొత్త ఐపాడ్​తో సహా మరో నాలుగు డివైజెస్​పై కంపెనీ పనిచేస్తోంది. ఈ అన్ని గ్యాడ్జెట్స్​ యూజర్స్​కు కాల్స్ మాట్లాడుకునేందుకు, ఫొటోస్ అండ్ వీడియోస్​ను క్యాప్చర్​ చేసేందుకు కూడా సహకరించనున్నాయి.

ఈ స్కిల్స్​ లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఔట్..!- విశ్లేషకుల హెచ్చరిక

వావ్.. ఇది అంతరిక్ష కేంద్రమా..?- డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.