Apple iOS 18.2 To Be Released in India: ఐఫోన్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ లేటెస్ట్ 18.2 అప్డేట్ అందుబాటులోకి వచ్చేందుకు రెడీగా ఉంది. కంపెనీ డిసెంబర్ రెండో వారంలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ అప్‌డేట్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే కంపెనీ ఈ అప్‌డేట్‌ను ఈరోజే రిలీజ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో 18.2 అప్డేట్ రిలీజ్ ఎప్పుడు? ఈ అప్డేట్లో ఏ ఫీచర్లు ఉన్నాయి? వంటి వివరాలు మీకోసం.
iOS 18 అప్డేట్లో ఫీచర్లు ఇవే!: WWDC 2024లో కంపెనీ తన యాపిల్ ఇంటెలిజెన్స్‌ని ప్రకటించింది. అయితే iOS 18 అప్డేట్తో ఈ ఫీచర్‌లు అందుబాటులోకి రాలేదు. కానీ యాపిల్ తాజాగా తీసుకొస్తున్న 18.2 అప్డేట్లో సిరి, జెన్‌మోజీ, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, అడ్వాన్స్‌డ్ రైటింగ్ టూల్స్‌తో పాటు Chatgpt ఇంటిగ్రేషన్‌తో సహా మరెన్నో AI ఫీచర్లు ఉన్నట్లు సమాచారం.
'iOS 18.2' అప్డేట్ రిలీజ్ ఎప్పుడు?: సమాచారం ప్రకారం.. భారత్‌లో 'iOS 18.2' అప్డేట్ డిసెంబర్ 9, 2024 రిలీజ్ కానుంది. అంటే ఇవాళ దాదాపు రాత్రి 10:30 PM ISTకి వస్తుందని తెలుస్తోంది.
ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?: iOS 18.2 అప్‌డేట్ విడుదలైన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది.
- iOS 18.2 అప్‌డేట్ కోసం మీ ఐఫోన్లో 'Settings' యాప్‌ను ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత 'General' లోకి వెళ్లి 'Software Update'పై ట్యాప్ చేయండి.
- ఇప్పుడు 'Download and Install' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా iOS 18.2 అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
iOS 18.2 ఫీచర్లు:
1. సిరితో ChatGPT ఇంటిగ్రేషన్: యాపిల్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ChatGPT ఇంటిగ్రేషన్‌తో iOS 18.2 అప్డేట్.. సిరిని AI (యాపిల్ ఇంటెలిజెన్స్)తో సూపర్‌ఛార్జ్ చేస్తుంది. సిరి.. యూజర్లు అడిగిన ప్రశ్నలు లేదా రిక్వస్ట్‌లను చాట్‌జీపీటీకి లింక్ చేస్తుంది. అయితే వినియోగదారుల రిక్వస్ట్ల IP అడ్రస్‌ను ఇది మాస్క్ చేస్తుంది. అంటే యూజర్లు అడిగిన వాటిని OpenAI ద్వారా స్టోర్ చేయదు. కొత్త సిరి ఫీచర్లను ఉపయోగించేందుకు యాపిల్ వినియోగదారులు వారి ChatGPT అకౌంట్లోకి సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు ఇది పూర్తి భద్రతను అందిస్తుంది.
2. జెన్‌మోజీ: ఈ ఫీచర్ వినియోగదారులు AIని ఉపయోగించి వారి కీబోర్డ్‌లో సరికొత్త ఎమోజీలను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వినియోగదారుల ఫొటోస్ యాప్‌లో ఉన్న 'పీపుల్ ఆల్బమ్' నుంచి డేటాను తీసుకుంటుంది. కాబట్టి యూజర్లు తమ వద్ద ఉన్న ఫొటోలను ఉపయోగించి ఎమోజీలను క్రియేట్ చేసేందుకు సహాయం చేస్తుంది.
3. ఇమేజ్ బ్యాండ్: యాపిల్ ఈ 18.2 అప్డేట్లో AI ఫీచర్లలో తీసుకొస్తున్న సూపర్ ఫీచర్లలో ఇమేజ్ బ్యాండ్ ఒకటి. ఇది ఐప్యాడ్ యూజర్లు రఫ్ స్కెచ్‌లను నోట్స్ యాప్‌లోని టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి పూర్తి స్థాయి ఇమేజ్‌లుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. అంటే మనం రఫ్‌గా టెక్ట్స్‌ను అందిస్తే ఈ ఫీచర్ మనకు దాని పూర్తి చిత్రాన్ని అందించగలదు.
4. ఇమేజ్ ప్లేగ్రౌండ్: ఈ ఇమేజ్ ప్లేగ్రౌండ్ అనేది యాపిల్ మొట్ట మొదటి AI ఇమేజ్ జనరేషన్ యాప్. ఇది కూడా టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఇమేజ్‌లను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. ఐఫోన్ వినియోగదారులు అందించిన టెక్స్ట్ ఆధారంగా జనరేట్ అయిన ఇమేజ్ మనకు నచ్చకపోతే మనం చెప్పిన సూచనల ఆధారంగా మరో ఇమేజ్ను జనరేట్ చేస్తుంది. ఇలా మనకు కావాల్సిన ఇమేజ్ రూపొందించేంత వరకు ఈ ఫీచర్ సహాయం చేస్తుంది.
5. విజువల్ ఇంటెలిజెన్స్: ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అనేది చూసేందుకు గూగుల్ లెన్స్ మాదిరిగా పనిచేస్తుంది. అంటే ఐఫోన్ యూజర్లు విజువల్ ఇంటెలిజెన్స్ కెమెరాను ఉపయోగించి తీసిన ఇమేజ్ టెక్స్ట్, స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్, పంపించిన ఇమేజెస్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మనం పంపించిన ఫీడ్ ఆధారంగా ఇది మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇలా ఈ ఫీచర్ రియల్-టైమ్ ఇన్ఫర్మేషన్ను అందిస్తూ రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది.
ఏ మొబైల్స్‌లో iOS 18.2 అప్డేట్ అందుబాటులోకి రానుంది?: పైన తెలిపిన ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను iOS 18.2 అప్డేట్ ద్వారా.. 'ఐఫోన్ 16 సిరీస్', 'ఐఫోన్ 15 ప్రో' మోడల్స్ కోసం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినప్పటికీ, కంపెనీ మరికొన్ని డివైజ్‌లకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
iOS 18.2 అప్‌డేట్‌ను పొందే ఐఫోన్ మోడల్‌ల లిస్ట్ ఇదే!:
ఐఫోన్ 16 సిరీస్:
- ఐఫోన్ 16
- ఐఫోన్ 16 ప్లస్
- ఐఫోన్ 16 ప్రో
- ఐఫోన్ 16 ప్రో మాక్స్
ఐఫోన్ 15 సిరీస్:
- ఐఫోన్ 15
- ఐఫోన్ 15 ప్లస్
- ఐఫోన్ 15 ప్రో
- ఐఫోన్ 15 ప్రో మాక్స్
ఐఫోన్ 14 సిరీస్:
- ఐఫోన్ 14
- ఐఫోన్ 14 ప్లస్
- ఐఫోన్ 14 ప్రో
- ఐఫోన్ 14 ప్రో మాక్స్
ఐఫోన్ 13 సిరీస్:
- ఐఫోన్ 13 మినీ
- ఐఫోన్ 13
- ఐఫోన్ 13 ప్రో
- ఐఫోన్ 13 ప్రో మాక్స్
ఐఫోన్ 12 సిరీస్:
- ఐఫోన్ 12 మినీ
- ఐఫోన్ 12
- ఐఫోన్ 12 ప్రో
- ఐఫోన్ 12 ప్రో మాక్స్
ఐఫోన్ 11 సిరీస్:
- ఐఫోన్ 11
- ఐఫోన్ 11 ప్రో
- ఐఫోన్ 12 ప్రో మాక్స్
ఐఫోన్ XR, XS, XS మాక్స్
ఐఫోన్ SE (2nd gen), ఐఫోన్ SE (3nd gen)
రెడ్మీ ట్రిపుల్ ధమాకా- ఒకేసారి మూడు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు లాంఛ్- ధర ఎంతో తెలుసా?
ఈ ఫోన్లలో గేమ్స్ ఆడితే.. ఆ మజానే వేరు.. నాన్‌స్టాప్ గేమింగ్‌కు బెస్ట్ మొబైల్స్ ఇవే!
మహింద్రా కొత్త 'BE 6e' పేరును మార్చింది.. కారణం ఏంటో తెలుసా?