ETV Bharat / technology

ఎప్పుడైనా, ఎక్కడైనా సిగ్నల్స్ లేకుండానే మెసేజ్​- ఆండ్రాయిడ్ 15 న్యూ ఫీచర్ - Android 15 Google Messages Feature

Android 15 Google Messages Feature : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్​ న్యూస్. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ అద్భుతమైన ఫీచర్​ను తీసుకురానుంది. మారుమూల ప్రాంతాల్లో నుంచి, అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్​లు చేసుకునేందుకు ఆప్షన్​ ఉపకరించనుంది.

Android 15 Google Messages Feature
Android 15 Google Messages Feature
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 7:38 PM IST

Android 15 Google Messages Feature : గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్​ 15 గురించి పెద్ద అప్​డేట్ ఇచ్చింది. త్వరలో విడుదల కానున్న బీటా వెర్షన్​లో అద్భుతమై ఫీచర్​ను తీసుకొస్తుంది. అదే ఆండ్రాయిడ్ 15లో వస్తున్న ఫీచర్ శాటిలైట్ మెసేజింగ్. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ నుంచి అయినా, ఎవరికైనా మెసేజ్​ చేసుకోవచ్చు. అది కూడా వైఫై లేదా మొబైల్ నెట్​వర్క్ సిగ్నల్స్ లేకుండా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించే విధంగా తీసుకురానుంది.

ఇప్పటికే ఐఫోన్స్​లో ఈ శాటిలైట్ ఫీచర్ ఉంది. కానీ, అది అత్యవసర సేవలకు మాత్రమే పరిమితం. అండ్రాయిడ్ 15 బీటా వెర్షన్​లో మాత్రం ఈ ఫీచర్​ కేవలం అత్యవసర సేవలకే కాకుండా మెసేజ్​లు పంపించడానికి, అలాగే తిరిగి రిసీవ్​ చేసుకునే విధంగా ఉంటుంది. అయితే ఈ శాటిలైట్ మెసేజింగ్​ ఫీచర్ ఎలా పనిచేస్తుందననే దాని గురించి కూడా విషయాలను వెల్లడించింది. మెసేజ్​లను పంపడానికి లేదా రిసీవ్​ చేసుకునేందుకు శాటిలైట్ కనెక్టివిటీ ఉండేలా బయట ఉండాలి అని గూగుల్ తెలిపంది. ఈ ఫీచర్ మెసేజ్​లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఫొటోలు, వీడియోలు వంటివి పంపడం కుదరదు.

ఐఫోన్​ కన్నా భిన్నంగా
మార్చిలో ఆండ్రాయిడ్ వినియోగదారులు మారుమూల ప్రాంతాల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో ఎవరికైనా మెసేజ్​ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నట్లు తెలుసుకున్నామని గూగుల్ తెలపింది. అందుకే ఆండ్రాయిడ్ 15 బీటా వెర్ష్​లో శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్​ను తీసుకొస్తున్నామని చెప్పింది. ఈ ఫీచర్​ యాపిల్ ఎస్​ఓఎస్​కు భిన్నంగా ఉంటుందని వివరించింది. ఎమర్జెన్సీ కాల్స్​ కాకుండా దీని ద్వారా త్వరలో ఎవరికైనా మెసేజ్​ చేసుకోవచ్చు అని గూగుల్ తెలిపింది.

ఆండ్రాయిడ్​ 15 ప్రివ్యూ
గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్​లో పెద్ద అప్​డేట్స్ ఇస్తుంది. ప్రస్తుతానికి ఫస్ట్​ డెవలపర్​ ప్రివ్యూను మాత్రమే రిలీజ్ చేసింది. త్వరలోనే దీని సెకండ్ ప్రివ్యూ, బీటా వెర్షన్ విడదల కానున్నాయి. అయితే గూగుల్ కంపెనీ ఈ ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​లో 3 కీలకమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. అవి ప్రైవసీ/ సెక్యూరిటీ, సపోర్టింగ్ క్రియేటర్స్​ అండ్ డెవలపర్స్​, మాక్సిమైజింగ్​ యాప్​ పెర్ఫార్మెన్స్​. ఆండ్రాయిడ్ 15లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

స్టన్నింగ్ ఫీచర్స్​తో టయోటా టైజర్ లాంఛ్​ - ధర ఎంతంటే? - Toyota Taisor Launch

మీ స్మార్ట్​ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ సింపుల్ టిప్స్​తో అంతా సెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.