2025 Toyota Camry Launched in India: ఇండియన్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రీమియం సెడాన్ కారును విడుదల చేసింది. ఈ కారు ఏడాది క్రితమే విదేశీ మార్కెట్లో రిలీజ్ అయి మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఈ కారును కంపెనీ భారత మార్కెట్లోకి కూడా తీసుకొచ్చింది. పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో ఈ తొమ్మిదో తరం క్యామ్రీ మోడల్‌ను కంపెనీ.. స్టన్నింగ్ డిజైన్, అధునాతన టెక్నాలజీతో తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
ఎక్స్‌టీరియర్: ఈ టయోటా క్యామ్రీ కారు సరికొత్త డిజైన్‌తో ఎంట్రీ ఇచ్చింది. దీని స్టైల్, డిజైన్ దాని ప్రీవియస్ మోడల్ కంటే చాలా భిన్నంగా ఉంది. ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే.. దీన్ని హ్యామర్ హెడ్ స్టైలింగ్‌తో రూపొందించారు. అంతేకాక దీనిలో హై-టెక్ ఫీచర్లతో సహా అనేక మార్పులు చేశారు.
దీనిలోని రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, హారిజాంటల్ స్లాట్లతో వైడ్ అండ్ అగ్రెసివ్ గ్రిల్, C-షేప్డ్ LED DRLs, కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ సెట్, డోర్ ప్యానెల్స్‌పై షార్ప్ క్రీసెస్, స్లిమ్ LED హెడ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటు లార్జ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని అప్‌డేట్ చేశారు. ఈ కారు ముందు భాగంలో గ్రిల్.. తేనెపట్టు ఆకారంలో ఉన్న ప్యాటెర్న్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్: దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఇది డ్యూయల్-టోన్ థీమ్, త్రీ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల స్క్రీన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, మల్టీ- జోన్ క్లైమేట్ కంట్రోల్, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అధునాతన ADAS సూట్‌తో వస్తుంది.
Proud to introduce the All New Camry Hybrid Electric Vehicle! A step forward in sustainable innovation, blending cutting-edge tech, safety and unmatched style. Here’s to driving a greener future for India! #ToyotaCamry @Toyota_India pic.twitter.com/eBqLqhV2mZ
— Manasi Kirloskar Tata (@M_KirloskarTata) December 11, 2024
పవర్‌ట్రెయిన్: కంపెనీ ఈ కొత్త టయోటా క్యామ్రీ కారులో ప్రీవియస్ మోడల్ మాదిరిగానే 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. అయితే ఈసారి దీన్ని హైబ్రిడ్ మోటార్ సెటప్‌తో తీసుకొచ్చింది. ఇది టయోటా ఐదో జనరేషన్ కారులో హైబ్రిడ్ సిస్టమ్ (THS 5)ను కలిగి ఉంటుంది. ఈ మార్పుతో కంపెనీ కారు కంబైన్డ్ పవర్‌ను 4 శాతం పెంచింది. ఇది 3200rpm వద్ద 221 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్పోర్ట్స్, ఎకో డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తోంది. లీటర్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
eCVT గేర్‌బాక్స్: కొత్త టయోటా క్యామ్రీ ఇప్పుడు గరిష్టంగా 230hp శక్తిని కలిగి ఉంటుంది. ఈ పవర్ మునుపటి వెర్షన్ టయోటా క్యామ్రీ పవర్ కంటే 12hp ఎక్కువ. ఇది మాత్రమే కాకుండా కొత్త హైబ్రిడ్ సిస్టమ్ కారు మైలేజీని కూడా మెరుగుపరిచింది. అదే సమయంలో కంపెనీ దీనికి eCVT గేర్‌బాక్స్‌ను అందించింది.
The wait is over! Experience elegance at every glance with the all-new Toyota Camry.#ToyotaIndia #Camry #EleganceAtEveryGlance pic.twitter.com/ICr969FtME
— Toyota India (@Toyota_India) December 11, 2024
టయోటా క్యామ్రీ ఫీచర్లు: తాజా క్యామ్రీ కారు స్టెబిలీటీ మరింత మెరుగుపడింది. దీని డ్రైవింగ్ డైనమిక్స్ కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. కంపెనీ డ్రైవింగ్ సీటు పొజిషన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఈ కారులో LED హెడ్‌ల్యాంప్‌లు, U-ఆకారపు DRLలు, ఇరుకైన గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా క్యామ్రీ సేఫ్టీ ఫీచర్లు: ఇండియాలో లాంఛ్ అయిన ఈ కొత్త టొయోటా క్యామ్రీలో కస్టమర్లు ADAS సూట్‌ను కూడా పొందుతారు. ఈ అధునాతన సిస్టమ్ కారు భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఇది అనేక కనెక్టింగ్ ఫీచర్ల సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ కారులో సేఫ్టీ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే ADAS, ప్రీ-కొలిజన్ సిస్టమ్, పాదచారులను గుర్తించడం, రాడార్ ఆధారిత క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, రోడ్ సైన్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఈ కారులో పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి.
ధర: కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఈ కారు ధరను రూ.48 లక్షలు (ఎక్స్- షోరూమ్)తో తీసుకొచ్చింది. ఈ ధర టయోటా ఇంతకు ముందు తీసుకొచ్చిన 8వ ఎడిషన్ కామ్రీ మోడల్‌తో పోలిస్తే రూ.1.83 లక్షలు ఎక్కువ.
యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్- కంటెంట్ ఖండాలు దాటేలా.. వారిపై ఇక కాసుల వర్షమే!
జియో న్యూఇయర్ వెల్కమ్ ఆఫర్- కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఖర్చు కంటే ఎక్కువ బెనిఫిట్స్!
శాంసంగ్ స్పెషల్ ఎడిషన్ మొబైల్స్ వచ్చేశాయ్- మూడేళ్ల వారంటీ, ఏడేళ్ల OS అప్డేట్తో పాటు మరెన్నో..!