YSRCP Victim at CM Chandrababu House: వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ భీమిలి నుంచి బాధితురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. లోలద రమణ అనే వైఎస్సార్సీపీ నేత వద్ద 2021 నుంచి 15 లక్షల రూపాయల చీటీ కడుతూ వచ్చానని బాధితురాలు జి. వెంకటలక్ష్మి తెలిపారు. చీటీ డబ్బులు తిరిగి చెల్లించకపోగా చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలువురితో తాను చీటీ కట్టించినందున వారంతా తనను కట్టమని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రమణ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించకపోగా గంజాయ్ బ్యాచ్‌తో తన కుమార్తెలను చంపిస్తానని బెదిరించటంతో పారిపోయి వచ్చాననన్నారు. గత 2 వారాల నుంచి ఎక్కడెక్కడో తల దాచుకుంటూ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు.
తాను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నానని, మొత్తంగా నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టామని తెలిపారు. ఇప్పుడు అందరూ తన ఇంటిమీదకి వస్తున్నారని, పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లినా, వాళ్లని కూడా ఆ వైఎస్సార్సీపీ నేత కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
తనని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, గంజాయి బ్యాచ్‌ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఊరి నుంచి తాము పారిపోయామని అందరూ అంటున్నారని వాపోయారు. తాము ఎక్కడకీ పారిపోలేదని, తమ చీటీ డబ్బుల కోసం వచ్చామన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంకటలక్ష్మికి ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
"నేను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నాను. నెలకు 75 వేల రూపాయల చొప్పున కట్టాము. ఇప్పుడు అందరూ మా ఇంటిమీదకి వస్తున్నారు. పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లాను. వాళ్లని కూడా కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారు. మేము నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టాము. ఊర్లో మేము పారిపోయాము అని అందరూ అంటున్నారు. మేము ఎక్కడకీ పారిపోలేదు. మా చీటీ డబ్బుల కోసం ఇక్కడకి వచ్చాము. ఆ వైఎస్సార్సీపీ నేత వలన మేము అప్పులపాలయ్యాము. ఆయన పేరు లోలద రమణ". - బాధితురాలు