ETV Bharat / state

జగన్​ సర్కార్​ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 6:18 PM IST

YSRCP Neglect maintenance of canals in Krishna District : పంట కాలువల నిర్వహణ అధ్వాన దుస్థితికి చేరుకోవడంతో కృష్ణా జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాలువల్లో తూటుకాడ, గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోవడంతో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల్లో పేరుకు పోయిన వ్యర్థాలు తొలగించకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.

farmers_canal_problem
farmers_canal_problem (ETV Bharat)

YSRCP Neglect Maintenance of canals in Krishna District : పంట కాలువల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో కృష్ణాజిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. పంట కాలువలను బాగు చేయకపోవడంతో జమ్ము, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి కాలువలు అధ్వానంగా మారాయి. నీటి ప్రవాహానికి ఇవి అడ్డగా ఉండటంతో పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షం వస్తే పొలాల్లోని నీరు బయటకు పోయే పరిస్థితి లేదని, దీని వల్ల పంటలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

కాలువల నిర్వహణ రైతుల పాలిట శాపం : కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన పంట కాలువల నిర్వహణ రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో జులైలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నీట మునిగి, రైతులు నష్టపోయారు. కాలువల మరమ్మతులకు నీటిపారుదలశాఖ ఏటా నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం, ప్రభుత్వం ఆలస్యంగా ఆమోదం తెలపడం, ఇంతలో నీటి విడుదల జరగడం ఆ తరువాత పైపై పనులు చేయడం నిధులతో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడం షరా మామూలైంది.

రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains

అధిక వర్షాలు కురిస్తే ముంపు సమస్య : డెల్టాలోని అన్ని ప్రధాన, అనుబంధ కాల్వల్లో తూటుకాడ భారీగా పేరుకుపోయింది. పెనమలూరు, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, గూడూరు, పెడన మండలాల్లో గుర్రపుడెక్క, నాచు తొలగింపు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు వేసవిలో జమ్ము, గుర్రపుడెక్క నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేయకపోవడంతో అధిక వర్షాలు కురిస్తే ముంపు సమస్య ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వ్యవసాయ ప్రధానమైన కృష్ణాజిల్లాలో కాల్వ నీటిపై ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. కృష్ణా నది అనుబంధంగా ఉన్న కాలువల కింద మొత్తం 7,36,531 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ కాల్వలకు ఏటా కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది గుత్తేదారులు ఆపరేషన్, మెయింటెన్సు పనులకు కనిష్టంగా 30% నుంచి గరిష్టంగా 41% తక్కువ ధరలకు టెండర్లను దాఖలు చేశారు.

వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో గాల్లో దీపంలా మారిన సాగునీటి ప్రాజెక్టులు - తట్టమట్టి కూడా తీయించిందేలే! - YSRCP Govt Neglect Water Projects

షార్టు టెండర్‌ నోటీసు జారీ : విజయవాడ జలవనరుల శాఖ సర్కిల్‌ పరిధిలో నాలుగు డివిజన్లలో మెయింటెన్సు పనులకు షార్టు టెండర్‌ నోటీసు జారీ చేశారు. సర్కిల్‌ పరిధిలో మొత్తం 160 పనులకు గాను రూ. 32.79కోట్లు అంచనాలతో టెండర్లను పిలిచారు. సగటున దాదాపు 35% తక్కువ ధరలకే టెండర్లను దాఖలు చేశారు. దీంతో ఆదా అయిన రూ.11.48 కోట్లతో మరిన్ని పనులు చేపట్టే అవకాశం ఉంది. కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌లో మాత్రమే అత్యవసర మరమ్మతుల కింద రూ. 3.30 కోట్ల విలువైన 11 పనులను ప్రతిపాదించారు. పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో వరద రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.

విజయవాడలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం - ప్రజాధనం వృథాపై విమర్శలు - Improper drainage system

కాలువలకు మరమ్మతులు : కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో సాగునీరు పొలాలకు చేరడానికి సమస్యగా మారిందని ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కాల్వల నిర్వహణ వేసవి కాలంలోనే చేస్తారని కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాల్వల నిర్వహణపై దృష్టి సారించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వర్షం వచ్చిన సమయంలో కాలువ పొంగి పొలాలను ముంచెత్తుతోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి కాలువలకు మరమ్మతులు చేపట్టి పంటలను కాపాడలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

షట్టర్లు ఊడుతున్నా పట్టించుకోరే! - వంశధార ప్రాజెక్టు కాలవల దుస్థితిపై అన్నదాతల ఆవేదన - Vamsadhara project shutters Ruined

జగన్​ సర్కార్​ నిర్లక్ష్యం - రైతుల పాలిట శాపంగా మారిన పంట కాలువల నిర్వహణ (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.