ETV Bharat / state

అదిగో పిన్నెల్లి- కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కాసేపట్లోనే ప్రత్యక్షం - PINNELLI IN PALNADU

YSRCP MLA Pinnelli Ramakrishna Reddy in Palnadu SP OFFice: హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ysrcp-mla-pinnelli-ramakrishna-reddy-in-palnadu-sp-office
ysrcp-mla-pinnelli-ramakrishna-reddy-in-palnadu-sp-office (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 8:31 AM IST

YSRCP MLA Pinnelli Ramakrishna Reddy in Palnadu SP OFFice : హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లో జూన్‌ 6 వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందే వరకూ పిన్నెల్లిని పట్టుకోలేకపోవటం రాష్ట్ర పోలీసుల ఘోర వైఫల్యానికి అద్దం పడుతుంది.

పిన్నెల్లి రోజూ హాజరు కావాల్సిందే- షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : హైకోర్టు - PINNELLI BAIL

ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. అయినా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పాల్వయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నేలకొసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజీ ఈ నెల 21న వెలుగుచూడటం, ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆయన కోసం గాలిస్తున్నామని ప్రకటనలివ్వడమే తప్ప పట్టుకోలేదు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందారు. ఈ నెల 23న ఈ ఉత్తర్వులొచ్చాయి. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేసే అవకాశమున్నా పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదు. చివరికి ఆ కేసుల్లోనూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొందేవరకూ పోలీసులు మౌనముద్ర దాల్చారు.

అదిగో పిన్నెల్లి- కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కాసేపట్లోనే ప్రత్యక్షం (ETV Bharat)

పిన్నెల్లి ముందస్తు బెయిల్​ పిటిషన్లు - జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు - No Action Against MLA Pinnelli

ఎస్పీ మలికా గర్గ్ ఎదుట పిన్నెల్లి సంతకం : పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అర్ధరాత్రి తరువాత చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చేయకుండా కొన్ని షరతులతో కూడిన మినహాయింపునిచ్చింది. ఈ క్రమంలో నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన లాయర్లతో చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేయాల్సి ఉంది. తొలిరోజు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి చేరుకుని ఎస్పీ మలికా గర్గ్ ఎదుట సంతకం చేసి తాను ఉండే చిరునామాను ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేశారు.

'సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బయటకు పంపండి'- 'ఏఎస్​ఐకి వార్నింగ్'- పిన్నెల్లి పర్వంలో దాగిన అరాచకాలెన్నో! - Palnadu YSRCP Leaders Anarchy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.