YSRCP Leaders Joining to Alliance Party : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాలకు చెందిన 100 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరాయి. కూటమి అభ్యర్థి ఈశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి అప్పులపాలు చేశాడని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి చెందాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
YSR District : వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతకొమ్మదిన్నె మండలంలోని పలు గ్రామాల్లో 100 కుటుంబాలు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
Satya Sai District : అధికార ప్రభుత్వ పరిపాలనలో విసిగిపోయిన సత్యసాయి జిల్లా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం పోతులకుంట పంచాయతీలో 15 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరాయి. వీరందరికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. సూపర్ సిక్స్ పథకాల ప్రాముఖ్యతను తెలుసుకున్నా ప్రజలు జూన్ 4న టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకొని వచ్చిన వారికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంలో ఆయన తెలియజేశారు.
'సూపర్ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join In TDP
Anantapur District : అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన 80 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరందరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రాప్తాడూ నియోజకవర్గంలోని 80 కుటుంబాలు పరిటాల సునీత సమక్షంలో టీడీపీలోకి చేరాయి. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి చేరిన వారిని అధికార నేతలు మళ్లీ భయపెట్టి, బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని పరిటాల సునీత హెచ్చరించారు.
వైసీపీని వీడుతున్న నేతలు- టీడీపీలోకి వందల కుటుంబాల చేరికలు - Joining From YCP To TDP Increasing