ETV Bharat / state

"పెట్రోల్ పోసి తగులబెడతాం - ఈనాడు నిన్ను కాపాడుతుందా?" వైఎస్సార్సీపీ నేతల దారుణం - మీడియాపై వైఎస్సార్సీపీ నేతల దాడి

YSRCP Leaders Attack on Eenadu Reporter: ఈనాడు విలేకరిపై వైఎస్సార్సీపీ గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అక్కడకు వెళ్లారు. ఇసుక మాఫియాను చిత్రీకరించి తిరిగి వస్తుండగా వైఎస్సార్సీపీ మూక దాడికి దిగింది. బైక్‌పై నుంచి ఈనాడు విలేకరిని కిందకి తోసేసి ఛాతీ, ముఖంపై పిడిగుద్దులతో హత్యాయత్నం చేశారని బాధితుడు తెలిపారు. తమ వెనుక ఎమ్మెల్యే శంకర్రావ్‌ ఉన్నారని పెట్రోల్ పోసి తగులబెడతామని హెచ్చరించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

YSRCP_Leaders_Attack_on_Eenadu_Reporter
YSRCP_Leaders_Attack_on_Eenadu_Reporter
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 10:03 AM IST

"పెట్రోల్ పోసి తగులబెడతాం - ఈనాడు నిన్ను కాపాడుతుందా?" వైఎస్సార్సీపీ నేతల రంకెలు

YSRCP Leaders Attack on Eenadu Reporter : రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ (Palnadu District Collector Sivashankar) తనిఖీకి వచ్చినప్పుడు తవ్వకాలు నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అమరావతి ఈనాడు విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావు అక్కడికి వెళ్లారు. మల్లాది ఇసుక రీచ్‌లో ప్రొక్లెయిన్లతో లారీలకు ఇసుక నింపుతున్నారు. తవ్వకాలు, తరలింపు జరుగుతున్న తీరును ఫొటోలు, వీడియోలు తీశారు.

YSRCP Leaders Attack on Media : అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా లారీలకు బిల్లులు రాసే షెడ్డు వద్ద కాపు కాచిన మల్లాదికి చెందిన వైఎస్సార్సీపీ నేత వెంపా శ్రీను, ఆయన అనుచరులు తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్, భవిరిశెట్టి నాగేశ్వరరావుతోపాటు మరో నలుగురు ద్విచక్రవాహనాన్ని ఆపి వాదనకు దిగారు. 'రీచ్‌లో ఫొటోలు తీయడానికి నీకేం పని? కలెక్టర్‌ వచ్చినా ఏమి చేయకుండా వెళ్లిపోయారు? పోలీసులు రావాలంటేనే భయపడతారు. అలాంటి ప్రాంతానికి నువ్వు వచ్చి ఫొటోలు తీస్తావా?' అంటూ బూతులు తిడుతూ ద్విచక్రవాహనంపై నుంచి పరమేశ్వరరావుని కిందికి తోశారు. కిందపడిన నన్ను పిడిగుద్దులు గుద్దారు అక్కడి నుంచి తప్పించుకుని కొంతదూరం వెళ్లి ఫోన్‌లో జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తుండగా వైఎస్సార్సీపీ మూకలు పరిగెత్తుకుంటూ వచ్చి చరవాణి లాక్కుని మరోసారి దాడి చేశారు. ద్విచక్రవాహన తాళాలను లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకుని వస్తుండగా వెంటపడి రాళ్లు విసిరారు. ఎలాగోలా బయటపడి ద్విచక్రవాహనంపై అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం అమరావతి పోలీసులు ఆసుపత్రికి వచ్చి పరమేశ్వరరావు నుంచి పిర్యాదు తీసుకున్నారు.

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి

మొత్తం 8మంది ఒక్కసారిగా చుట్టుముట్టి మారు మాట్లాడకుండా పిడిగుద్దులు గుప్పించటంతో పరమేశ్వరరావు ఏమీ చేయలేకపోయారు. బూతులు తిడుతూ ముఖం, వీపు, డొక్కలపై ఎక్కడపడితే అక్కడ ముష్ఠిఘాతాలు విసిరారు. 'మాకే అడ్డొస్తావా? పెట్రోల్‌ పోసి తగలబెడితే నీకు దిక్కెవరు అంటూ రంకెలు వేశారు. పెట్రోల్‌ సీసాలు తీసుకురండిరా పరమేశ్వరరావును తగలబెడతామంటూ భయాందోళనకు గురిచేశారు. ఇక్కడ ఏంచేస్తే నిన్నెవరు కాపాడుతారు' అంటూ రంకెలు వేశారు. 'ఈనాడు నిన్ను కాపాడుతుందా?' అంటూ రెచ్చిపోయారు. 'మమ్మల్ని ఆపే ధైర్యముందా?' అంటూ విరుచుకుపడ్డారు. 'అధికారంలో ఉన్నాం ఎమ్మెల్యే శంకర్రావ్‌ మా వెనుక ఉన్నారు? మీరేం చేస్తారు' అంటూ బెదిరించారు. అప్పటి పరిస్థితి చూసి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని, భార్యాపిల్లలు గుర్తుకు వచ్చారని పరమేశ్వరరావు తెలిపారు. అమరలింగేశ్వరుడి దయ వల్లే ప్రాణాలు దక్కాయన్నారు.

పరమేశ్వరరావు చరవాణి తీసుకున్న వైఎస్సార్సీపీ నేతలు అందులో సమాచారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. చరవాణిలో సిమ్‌కార్డులు తీసి మరో చరవాణిలో వేసి సమాచారం తొలగించడానికి తీవ్రంగా యత్నించారు. అయితే మల్లాదితో పాటు కృష్ణాతీరం వెంట అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పరమేశ్వరరావు తెలిపారు. వాటిని బయటపెట్టాలనే ఉద్దేశంతో వెళ్లినప్పుడు దాడి జరిగిందన్నారు. దాడి విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన స్పందించి సత్తెనపల్లి డీఎస్పీ, అమరావతి సీఐలతో మాట్లాడి వెంటనే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. పోలీసులు ఇసుకరీచ్‌ వద్దకు చేరుకునే సరికే పరమేశ్వరరావు తప్పించుకుని వచ్చేశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి పోలీసులు పరమేశ్వరరావు చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు - ఈనాడు, ఈటీవీ రిపోర్టర్లపై దాడి

అనంతరం సీఐ ఏవీ బ్రహ్మం అమరావతి అసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరావు వద్దకు వచ్చి వివరాలు నమోదుచేసుకుని వెళ్లారు. పరమేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్‌ అమరావతి ఆసుపత్రిలో పరమేశ్వరరావును పరామర్శించారు. వైసీపీ నేతల దాడిని ఖండించారు. కలెక్టర్‌ తవ్వకాలు ఆపాలని ఆదేశించినా అక్కడ కొనసాగిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

పిడిగుద్దులు కురిపించటంతో పరమేశ్వరరావు శరీరంలో కనిపించని గాయాలయ్యాయి. అయితే దీనిపై పోలీసులు ఐపీసీ 324తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెట్రోల్ పోసి తగులబెడతామని హెచ్చరించినా హత్యాయత్నం సెక్షన్లు పెట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది.

మమ్మల్నే డబ్బులు అడుగుతావా? - టోల్ గేట్ సిబ్బందిని చితకబాదిన వైఎస్సార్సీపీ నేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.