ETV Bharat / state

కల్తీ నెయ్యిలో లేదు - ఆవులోనే ఏదో జరిగిందండీ: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు - Tammineni Sitaram on Tirupati laddu - TAMMINENI SITARAM ON TIRUPATI LADDU

Tammineni Sitaram on Tirupati laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెయ్యిలో కల్తీ లేదని, పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని అన్నారు. సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు.

Tammineni Sitaram on Tirupati laddu Controversy
Tammineni Sitaram on Tirupati laddu Controversy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 10:20 AM IST

Tammineni Sitaram on Tirupati laddu Controversy : తిరుమల శ్రీవారి లడ్డూపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏమన్నారంటే?

వివాదాలకు పోకుండా ఉండాలి : తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని, పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని, ఆవాలు, అవిశలు, పామాయిల్‌ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి కావొచ్చని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని అన్నారు. తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం - ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌పై కేసు - Case File on AR Foods

పరీక్షలో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్‌డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని అన్నారు. ఉన్న లోపాలేంటి, జరిగిందేంటి అనేది తెలుసుకోవాలని సూచించారు. ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకోవడం అవుతుందని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ విషయంలో వివాదాలకు పోకుండా ఉండాలని సూచించారు.

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy

TTD Case File on AR Foods : శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై చర్యలకు ఉపక్రమించింది. టెండర్‌ నిబంధనలను అతిక్రమించి నాణ్యతలేని, కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

"లడ్డూ అంటే ఇది" - ఊపిరి పీల్చుకుంటున్న శ్రీవారి భక్తులు - "ఆనంద నిలయం"లో హర్షాతిరేకాలు - TIRUMALA LADDU QUALITY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.