ETV Bharat / state

జగన్‌ హయాంలో జలయజ్ఞం వైఫల్యం - ఆ ప్రాజెక్టులే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం - EX CM jagan on irrigation projects

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 8:01 AM IST

YSRCP Government Negligence on Jalayagnam Project: తక్కువ వ్యయం త్వరిత ప్రయోజనం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పుడు ఇదే సరైన వ్యూహం. రాష్ట్రంలో సత్వరం పూర్తయ్యే 31 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిస్తే సత్వర ఫలాలు అందుకోవచ్చన్నది జలవనరుల శాఖ అధికారుల అంచనా. వీటికి చాలినన్ని నిధులు కేటాయిస్తే ప్రయోజనాలు మెండుగా ఉంటాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

YSRCP Government Negligence on Jalayagnam Project
YSRCP Government Negligence on Jalayagnam Project (ETV Bharat)

YSRCP Government Negligence on Jalayagnam Project : వ్యవసాయఆధారిత ఆంద్రప్రదేశ్‌ అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. గత ఐదేళ్లు పడకేసిన ప్రాజెక్టులను పట్టాలెక్కించడం, వాటిని పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వడం కూటమి ప్రభుత్వ కర్తవ్యం. ఐతే తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 59 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు 2లక్షల 33 వేల కోట్లు.

EX CM Jagan on Irrigation Projects : ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులపై లక్షా 29 వేల కోట్లు వెచ్చించినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆ లెక్కన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే మరో లక్షా 4 వేల కోట్లు కావాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిన వేళ ప్రస్తుతం అంతమొత్తంలో వెచ్చించడం చాలా కష్టం. ఐతే మొత్తం 59 ప్రాజెక్టుల్లో 31 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా గుర్తించి చాలినన్ని నిధులు కేటాయిస్తే త్వరితగతిన ప్రయోజనాలు అందుతాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

జగన్‌ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM

పెండింగులో వేల కోట్ల బిల్లులు : ప్రస్తుతం 59 ప్రాజెక్టుల్లో 31 ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయొచ్చని తద్వారా రాష్ట్రాన్ని కరవుకోరల్లోంచి బయటకు తీసుకురావచ్చని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేస్తే సత్వర ఫలితాలు అందుతాయని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో గుత్తేదారులకు వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. చాలామంది గుత్తేదార్లు పనులు వదిలేసి వెళ్లిపోయారు. సాగునీటి రంగంలో మొత్తం పెండింగు బిల్లులు ఎంత ఉన్నాయో తేల్చి ఫిఫో పద్ధతిలో బిల్లుల చెల్లింపులకు హామీ ఇచ్చి గుత్తేదారులకు భరోసా కల్పించాలి.

అప్పుడే వారు మళ్లీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు పోటీపడతారు. భూసేకరణ, అటవీ అనుమతులు రాకపోవడంతో చాలా ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. దీంతో అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి. తొలుత భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో, అటవీభూమికి సంబంధించి కేంద్ర వద్ద పరిష్కారం కావాల్సిన అంశాలపై దృష్టి సారించాలి. డిజైన్ల ఆమోదమూ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర ఆకృతుల సంస్థకు అవసరమైన నాణ్యమైన ఇంజినీరింగ్‌ సిబ్బందిని నియమించాలి. అక్కడ సమస్యలు పరిష్కరించాలి. కొన్నిచోట్ల ఎన్నాళ్ల నుంచో పని లేకుండా ఉండిపోయిన ఇంజినీరింగ్‌ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేసి, అవసరం ఉన్న చోట నియమించాలి. చేయడానికి పనిలేని అలాంటి యూనిట్లను గుర్తించి, వాటిని సంస్కరించాలి. అప్పుడే సాగునీటి ప్రాజెక్టుల పనులు ఊపందుకుంటాయి.

సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు

జలయజ్ఞంపై ఎన్నో హామీలు : వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 7 శాతం నిధులు వెచ్చించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ రంగానికి కేవలం 3 శాతమే కేటాయించారు. దాన్ని 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు 9 శాతానికి పెంచారు. జలయజ్ఞంపై ఎన్నో హామీలు గుప్పించిన జగన్‌ ప్రభుత్వం దాన్ని మళ్లీ 4 శాతానికి తగ్గించేసింది. కీలక రంగాలపై వెచ్చించే నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితేనే అంచనా వ్యయాలు భారీగా పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతాం. జగన్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని అంతకు ముందు ప్రభుత్వం కంటే సగానికి పైగా తగ్గించేయడంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది.

కడప జిల్లాలో జలయజ్ఞం ఇదేనా! గుక్కెడు తాగు నీటి కోసం నరకయాతన - huge water problem in ysr district

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.