ETV Bharat / state

మంచి ముసుగులో దోపిడీ - ఎసైన్డ్‌ భూముల కోసం బరితెగించిన వైఎస్సార్సీపీ ముఠాలు - YSRCP Govt Eye on Assigned Lands

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 6:50 AM IST

YSRCP Govt Eye on Assigned Lands: లక్షల ఎకరాల ఎసైన్డ్‌ భూములను కొట్టేసే కుట్రకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది తెరలేపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఉద్ధరిస్తున్నామంటూ ఎసైన్డ్‌ భూముల్ని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్టసవరణ చేసింది. జీఓ జారీకి ముందే ముఖ్య అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలు ఉన్నారు.

YSRCP Govt Eye on Assigned Lands
YSRCP Govt Eye on Assigned Lands (ETV Bharat)

మంచి ముసుగులో దోపిడీ - ఎసైన్డ్‌ భూముల కోసం బరితెగించిన వైఎస్సార్సీపీ ముఠాలు (ETV Bharat)

YSRCP Govt Eye on Assigned Lands: ఇరవై ఏళ్ల కంటే ముందు ఎసైన్‌ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ 2023 జులై 31 నుంచి అమల్లోకి వచ్చేలా చట్టసవరణ చేస్తూ గతేడాది అక్టోబర్‌ 27న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీఓ జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని ఎసైన్డ్‌ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో, పణమో ముట్టచెప్పి అక్కడ నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటిచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటిచోట్ల 50- 70శాతం వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములదీ ఇదే పరిస్థితి.

రెవెన్యూ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యం - ఏకపక్షంగా భూ రికార్డులు తారుమారు - YSRCP Leaders Land Grabs

పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు: జీఓ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల ఎసైన్డ్‌ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా వేల కోట్ల ఎసైన్డ్‌ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖపట్నం పరిధిలోని ఎసైన్డ్‌ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని, వారి దగ్గర నుంచి సుమారు వెయ్యి ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాలను 10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీఓ 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి ఎసైన్డ్‌ భూములు అగ్రిమెంట్‌ చేసుకుని సవరణ జీఓ వచ్చాక పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి.

ఎన్నికల కోడ్‌ ఉండగానే: విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతోపాటు, విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎలక్షన్ కోడ్‌ అమల్లోకి వచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల ఎసైన్డ్‌ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికేట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో సుమారు 2 వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో పద్మనాభం, ఆనందపురం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఎలక్షన్ కోడ్‌ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేస్తూ మరో జాబితాను పంపారు.

జగన్‌ చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! - NO SAFETY FOR ENDOWMENT LANDS

దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి : రాష్ట్రంలో ఎసైన్డ్‌ భూములెన్ని, వాటిలో 2003వ సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ రిపోర్టు ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబరు 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్‌ భూములు పంపిణీ చేయగా అందులో ప్రస్తుత ఏపీలో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీఓ ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20 శాతం భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలు మాత్రమే అని వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది.

29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలను చూపుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్‌ భూముల్లో యజమానులు, వారసులు లేరని చెప్తోంది. అన్యాక్రాంతమైన భూముల్లో చాలా వరకు ఎసైన్డ్‌ కేటగిరిలోనే లేవు. సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించి భూముల రికార్డుల్లో అనుభవదారు, వారసుల పేర్లు లేవు. మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం పేర్లు మార్చడం ఏంటి? - అధికారులపై హై కోర్టు ఆగ్రహం - Lands Dispute Case in High Court

ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు మూడంచెల విధానంలో పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టప్రకారం ఫ్రీహోల్డ్‌కు అర్హమైన ఎసైన్డ్‌ భూముల పరిశీలనను 100శాతం వీఆర్వోలు, 100శాతం తహశీల్దార్లు, ర్యాండమ్‌గా 10శాతం ఆర్డీఓలు నిర్వహించాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎస్‌ఓను సవరించాలి. ఈ విధానం సరిగా అమలు కావడం లేదు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించి, కొందరు వైఎస్సార్సీపీ నేతలు లబ్ధిపొందుతున్నారు.

దుర్గ గుడిలో వైసీపీ నేత తిష్ఠ - అదునుచూసి ఆస్తులన్నీ స్వాహా - YSRCP Leaders Irregularities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.