YCP Former Minister Kakani Follower Arrest Due To Sexual Harassment : ‘ఆమె ఓ చిరుద్యోగి భార్య. భర్త మరణంతో ఒక్కసారిగా కుటుంబభారం మొత్తం ఆమెపై పడింది. కుటుంబపోషణ నిమిత్తం భర్త ఉద్యోగం కోసం ప్రయత్నించింది. కానీ అత్తింటివారూ ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య రంగప్రవేశం చేశారు. భర్త ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డారు. చివరికి నిరాశ్రయురాలైన ఆ మహిళను భయపెట్టి లోబరుచుకున్నారు. అనంతరం పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినా విడిచిపెట్టలేదు. ఇలా రోజూ వేధిస్తుండటంతో గత్యంతరం లేక బాధితురాలు సోమవారం వెంకటాచలం పోలీసులను ఆశ్రయించారు. దీంతో మందల వెంకట శేషయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం వివరాలివీ, తిరుపతి జిల్లాలోని నాయుడుపేట పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన మహిళకు మరో ప్రాంతంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తితో 13 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త 2021లో గుండెపోటుతో మరణించాడు. అనంతరం భర్త ఉద్యోగాన్ని అత్తింటివారు ఆమెకు కాకుండా భర్త తమ్ముడికి ఇప్పించేందుకు ప్రయత్నించారు. దానికి ప్రస్తుతం నిందితుడిగా ఉన్న మందల వెంకట శేషయ్య సహకరించారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు ఉద్యోగం లేకపోతే తాను, తన బిడ్డలు రోడ్డున పడతామని ఆయన్ను ప్రాధేయపడ్డారు.
'తల్లిదండ్రులూ' తస్మాత్ జాగ్రత్త - పక్కనే మృగాళ్లున్నారు!! - POCSO Act
దాంతో ఆమెకు ఉద్యోగం. ఇతర ప్రయోజనాలు అత్తమామలకు వచ్చేలా మందల వెంకట శేషయ్య రాజీ చేశారు. ఈ క్రమంలో వెంకటశేషయ్య తనతో అనుచితంగా ప్రవర్తించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడని తెలిపింది. అలాగే తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని వాపోయింది. లైంగిక వాంఛ తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని బెదిరించినట్లు వెల్లడించింది. గత్యంతరం లేక అంగీకరించడంతో తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్కూల్‌కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్!
‘2022 సంవత్సరంలో నాకు సూళ్లూరుపేటలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నాను. అయిన ఏదో ఒక కారణంతో పిలిపించి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇటీవల చాలాసార్లు ఫోన్ చేసినా నేను స్పందించ లేదు. దీంతో కోపం పెంచుకున్నాడు. అనేక సార్లు ఫోన్ చేస్తుండటంతో ఈ నెల 22న వెంకటాచలం వచ్చాను. అప్పుడు నా జీతం లాక్కొని, జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. దీంతో అక్కడ నుంచి తప్పించుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చాను’ అని బాధితురాలు ఫిర్యాదులో వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుణ్ని అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటాచలం సీఐ సుబ్బారావు తెలిపారు.