ETV Bharat / state

ఓటర్లకు వైఎస్సార్సీపీ తాయిలాల ఎర - లక్షా 26 వేల కుక్కర్ కూపన్లు స్వాధీనం - YSRCP Cookers Distribution

YSRCP Cookers Distribution in Vijayawada: తాయిలాలను ఎరగా వేసి ఓట్లు పొందేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక దగ్గర భారీగా తాయిలాలు పట్టుబడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్‌లో ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసుకున్న కుక్కర్‌ స్టిక్కర్లను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూపన్లకు సంబంధించిన వ్యయం 10 కోట్ల రూపాయలపైనే ఉంటుంది.

YSRCP_Cookers_Distribution
YSRCP_Cookers_Distribution
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:54 PM IST

YSRCP Cookers Distribution in Vijayawada: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలను ఎరవేసిన వైఎస్సీర్సీపీ, ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లు ముద్రిస్తూ, సీ విజిల్‌ యాప్‌నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం అజిత్‌సింగ్‌ నగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో భారీగా కుక్కర్లు ప్యాకింగ్‌ చేసి ఉన్నాయని ఆదివారం మధ్యాహ్నం సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు వచ్చింది.

ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌-9 అధికారి డి.రవిచంద్ర సూర్యకుమార్‌ సిబ్బందితో వెళ్లి లక్కీ ప్రింటర్స్​లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వస్తువులు కనిపించలేదు. కానీ ప్రెషర్‌ కుక్కర్‌, ఫ్యాన్‌ గుర్తున్న షీట్లు 5 వేల 250 దొరికాయి. ఒక్కో షీట్‌లో 24 కూపన్లు ఉన్నాయి. దీనిపై ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారి రవిచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.

వైసీపీ కార్యాలయంలో భారీ ఎత్తున తాయిలాలు- ఆటోలతో స్థానిక నేతల ఇళ్లకు తరలింపు - YSRCP Gifts Transport Issue

కుక్కర్లు ఎక్కడ: పోలీసులు తనిఖీ చేయగా మొత్తం లక్షా 26 వేల కూపన్లు దొరికాయి. కుక్కర్లు దొరక్కపోవడంతో వాటిని రహస్య ప్రదేశంలో దాచారా లేదంటే దుకాణాల గోదాముల్లో నిల్వ చేశారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఓటర్లు ఈ కూపన్లను పట్టుకెళ్లి కుక్కర్లు తెచ్చుకునేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వాలంటీర్లకు వైఎస్సీర్సీపీ నాయకులు ఒక్కోటి 800 రూపాయల విలువ చేసే కుక్కర్లు పంచారు. తాజా కూపన్లలోనూ అలాంటి చిత్రాలే ముద్రించారు. ఈ లెక్కన లక్ష 26 వేల కుక్కర్ల వ్యయం సుమారు 10 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. అంతమొత్తంలో వస్తువులను దుకాణాల్లో ఉంచడం అసాధ్యమని, అవి ఎక్కడ దాచారో తెలియాల్సి ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- ఓట్లు తమకే వేయించాలని తాయిలాల ఎర - YSRCP Distribute Gifts to MEPMA RPs

ఇవే కాకుండా కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని గిడ్డంగిలో పెద్ద ఎత్తున చీరలను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 బండెల్స్​లో ఉన్న 1,800 చీరలను సీజ్ చేశారు. చీరల పెట్టెల మీద సీఎం జగన్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. చీరలతో పాటు వైసీపీ చిహ్నాలతో ముద్రించి ఉన్న మరికొన్ని సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానశ్రయ సమీపంలోని 5 గోదాముల్లో భద్రపరిచిన తాయిలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ తాయిలాల ఘటనపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. మునుపెన్నడూ లేనిరీతిలో వైసీపీ నేతల సిద్ధం చేసిన తాయిలాలు బయటపడటం కలకలం రేపుతోంది.

కనిగిరిలో వాలంటీర్లకు తాయిలాలు - జగన్ చిత్రంతో ఉన్న సంచిలో గిఫ్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.