ETV Bharat / state

పార్టీ సమావేశంలో జగన్ షాకింగ్​ కామెంట్స్- 'కళ్లు మూసుకుంటేనే 11సీట్లు!' - Ys Jagan Viral Video

Ys Jagan Videos Viral On Social Media: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి, మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయని పేర్కొన్నారు. సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయిందంటూ వైఎస్‌ జగన్‌ మాట్లాడిన తీరు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అవుతోంది.

Ys Jagan Videos Viral On Social Media
Ys Jagan Videos Viral On Social Media (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 7:09 PM IST

Ys Jagan Videos Viral On Social Media: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మాటతీరు మారింది. గత కొద్ది రోజులుగా తాడేపల్లి ఫ్యాలెస్​కే పరిమితమైన జగన్, తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సీఎంగా పదవి కోల్పోయిన అనంతరం జగన్ తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ... ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఇప్పటి వరకూ సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయింది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గత ఐదేళ్లు కళ్లు మూసుకోవడమేంటి? అలా ఎలా మాట్లాడారు అంటూ ఆశ్చర్యపోవడం పార్టీ నేతలవంతు అయ్యింది.
నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు - Chandrababu Take Charge as CM

సామాజిక మాధ్యమాల్లో జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న నెటిజన్లు: ‘అలా కళ్లు మూసుకుని ఐదేళ్లు గడపబట్టే, పాలన లేక ఆంధ్రప్రదేశ్‌ మటాష్‌ అయిపోయింది’, ‘మేమూ అదే చెప్పాం సర్‌.. మీరు ఇక కళ్లు మూసుకుని ప్రశాంతంగా పడుకోండి’, ఎందుకు ఓడిపోయామో కళ్లు తెరిచి బూతులు మాట్లాడకుండా పోరాటం చేయండి’, ‘ఐప్యాక్‌ స్క్రిప్ట్‌ లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయి’, ‘కళ్లు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి’,‘2049 వరకూ కళ్లు మూసుకుని ఉండాలి’, ‘అన్నా నువ్వు నిజంగానే సీఎంగా చేశావా’, ‘2060 వరకూ కళ్లు తెరవద్దు అన్నా’, ‘కళ్లు మూసుకోవడం కాదన్నా, ‘పవర్‌.. పవర్‌.. పవర్‌.. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావా జగనన్నా. అవి వచ్చేలోపు ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించవచ్చు కదా’ అంటూ కామెంట్లు, మీమ్స్‌తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - తొలిరోజే ఆ ఐదు సంతకాలు పూర్తి - CM Chandrababu Naidu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.