YS Sharmila key comments on Avinash Reddy: కడప ఎంపీగా తనను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చని, అవినాష్ రెడ్డి గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కడప ఎన్నికలు న్యాయానికి - నేరానికి మద్య జరుగుతున్న పోరాటమన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా, కమలాపురంలో బహిరంగ సభలో మాట్లడి ఆమె వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదని షర్మిల పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ఎంత ముఖ్యమో, మనకు కడప స్టీల్ అంత ముఖ్యమని, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు అయినా వచ్చేవన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేశారు. మొదటి 5 ఏళ్లు బాబు మోసం చేస్తే. మరో ఐదు సంవత్సరాలు జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. YSR హయాంలో 54 ప్రాజెక్ట్ లు మొదలు పెట్టారని, 2014 నాటికి 42 పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయన్నారు. జగన్ YSR వారసుడు అయితే, జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview
జీఎన్ఎస్ఎస్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం అన్నారు, తట్టెడు మట్టి తియ్యలేదని దుయ్యబట్టారు. సర్వారాయ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని, సర్వారాయ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఏమో కానీ, రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువు, రొయ్యల చెరువు కి నీళ్ళు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నది మీ చెరువులు నింపుకోడానికా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా మాఫీయా మయం కొనసాగుతుందని షర్మిల ఆరోపించారు. లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫీయా, గంజాయి మాఫీయా, ఇసుక మాఫియా, మట్టి మాఫీయా కొనసాగుతుందన్నారు. 10 ఏళ్లలో మన రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాషింగ్ టన్ డీసీ కడతా అన్న జగన్, ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులు అన్నాడని, చివరికీ ఒకటి కూడా లేదని ఎద్దేవా చేశారు.
జగన్ పాలన మొత్తం హత్యా రాజకీయాలని, సొంత బాబాయిని హత్య చేస్తే చర్యలు లేవని ఆరోపించారు. బాబాయిని చంపిన హంతకుడు అవినాష్ కి మళ్ళీ పట్టం కట్టాడని షర్మిల ఆరోపించారు. వివేకాకు మగ బిడ్డలు లేరు. జగన్ ను ఆయన కొడుకు అనుకున్నారు. సొంత కొడుకు లాంటి వాడి వాడు హంతకులను కాపాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినాష్ రెడ్డి నిందితుడు అని గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాయని వెల్లడించారు. ఇన్నీ ఆధారాలు ఉన్నా..నిందితుడు అవినాష్ రెడ్డి కాపాడుతున్నాడని పేర్కొన్నారు. అరెస్ట్ చేయాలని చూస్తే కర్నూల్ లో మూడు రోజులు కర్ఫ్యూ సృష్టించారని గుర్తుచేశారు.