ETV Bharat / state

పులులు, సింహాలని చెప్పుకునే వారు బీజేపీని చూసి పిల్లుల్లా తయారయ్యారు: షర్మిల - ys sharmila election campaign

YS Sharmila Election Campaign: ప్రతిపక్షనేతగా మడకశిర వచ్చి అనేక హామీలిచ్చిన జగన్‌ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్కటీ నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ తనయుడినని చెప్పుకుంటున్న జగన్‌ ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని విమర్శించారు. పులులు, సింహాలని చెప్పుకునే వారు బీజేపీని చూసి పిల్లుల్లా తయారయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YS Sharmila Election Campaign
YS Sharmila Election Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:48 PM IST

Updated : Apr 18, 2024, 8:38 PM IST

YS Sharmila Election Campaign: పులులు, సింహాలు అని చెప్పుకునే జగన్, బీజేపీని చూసి పిల్లిలా అయ్యారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వైఎస్సార్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ న్యాయ యాత్ర ఎన్నికల ప్రచార బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి మడకశిర నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ హామీని మరిచారని విమర్శించారు. అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఇక లెదర్ పార్కు హామీని సైతం మరిచారని షర్మిల మండిపడ్డారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన జగన్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్కటైనా సాధించారా అంటు జగన్​పై ధ్వజమెత్తారు.

మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారు: షర్మిల - YS Sharmila Warning To YS Jagan

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడని చెప్పుకుంటూ ఆయన ఆశయాలకు నీరుగారుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓటు వేసే సమయం వచ్చిందని, ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆయుధం మీ చేతికి వస్తుందని అన్నారు. దీన్ని వృథా చేస్తే మీతో పాటు మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందని షర్మిల తెలిపారు. మీకోసం అహర్నిశలు కష్టపడి మీ ముందుండే నాయకుడికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది అని, దానితో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని షర్మిల తెలిపారు. కానీ ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెట్టారని, ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ఏపీ గురించి పట్టించుకోని జగన్ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించిన షర్మిల, హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ఈ హామీని ఏఐసీసీ మేనిఫెస్టోలో సైతం పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు.

నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదు- ఆమె ఇంట్లో నలుగురు మంత్రులు : షర్మిల - YS Sharmila on Roja

ప్రతి మహిళ పేరు మీద 5 లక్షల రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న షర్మిల, వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛన్‌ అందిస్తామన్నారు. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే జగన్‌, ఎన్నికలు ఉన్నాయని సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా అని ప్రశ్నించిన షర్మిల, వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, వారసుడి పాలనలో ఎక్కడికి పోయిందని షర్మిల నిలదీశారు.

అనంతరం సింగనమల నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా అన్నీ చేసి దోచుకున్నారని షర్మిల మండిపడ్డారు. పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి హామీ ఏమైందని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బీజేపీతో జగన్‌కు రహస్య పొత్తు ఉందన్న షర్మిల, ప్రత్యేక హోదా గురించి వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఒక్క ఉద్యమమైనా చేశారా అని నిలదీశారు. వీరికి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రాదని దుయ్యబట్టారు.

ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి: షర్మిల - YS Sharmila Election Campaign

రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా నడుస్తోందని, మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీ ఏమైందని మండిపడ్డారు. వైసీపీ వచ్చాక 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారని, ప్రతి జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని, ఐదేళ్ల తర్వాత మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇచ్చారన్న షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణ అని విమర్శించారు.

మాట నిలబెట్టుకోలేని వారు వైఎస్‌ఆర్‌ ఆశయాలు నెరవేర్చలేరన్న షర్మిల, పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని కావాలంటే కాంగ్రెస్‌ రావాలని తెలిపారు. ప్రతి గడపకు వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

పులివెందుల ప్రజలారా కొంగుచాచి అడుగుతున్నాం- న్యాయం చేయండి: షర్మిలా, సునీత - Sharmila Election Campaign

పులులు, సింహాలని చెప్పుకునే వారు బీజేపీని చూసి పిల్లుల్లా తయారయ్యారు: షర్మిల

Last Updated : Apr 18, 2024, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.