ETV Bharat / state

వైఎస్​ కుటుంబంలో వాటాల రచ్చ - తల్లి, చెల్లిని కోర్టుకీడ్చిన జగన్‌

వైఎస్ జగన్​, షర్మిల మధ్య రచ్చకెక్కిన వివాదాలు

YS Jagan Petition in NCLT
YS Jagan Petition in NCLT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 11:09 AM IST

YS Jagan Petition in NCLT : వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని సమాచారం. తాజాగా జగన్​ కోర్టును ఆశ్రయించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్​లో కోరారు.

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్​ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని వారు పిటిషన్ దాఖలు చేశారు

ఈ పిటిషన్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ సెప్టెంబర్ 10న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని క్లాట్ విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

చెల్లి కన్నా భార్య తరఫు బంధువులు జగన్‌కు ఎక్కువయ్యారా?: వైఎస్ షర్మిల - YS Sharmila vs bharathi reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.