ETV Bharat / state

వైఎస్ జగన్ పాస్‌పోర్టు అంశంలో కొనసాగుతున్న సస్పెన్స్ - తీర్పు వచ్చేది అప్పుడే! - YS Jagan Passport Renewal Issue

YS Jagan Passport Renewal Issue: పాస్‌పోర్టు అంశంలో జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పాస్‌పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్​పై ఇరువైపు వాదనలు ముగిశాయి. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడించనుంది.

YS Jagan Passport Renewal Issue
YS Jagan Passport Renewal Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 8:22 AM IST

YS Jagan Passport Renewal Issue: పాస్ పోర్టు పునరుద్ధరణపై (రెన్యూవల్) విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. తనపై విజయవాడ కోర్టులో 2018లో నమోదైన పరువునష్టం కేసు గురించి జగన్‌కు తెలుసని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. నేర చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి(ఈసీ) తెలియజేసే క్రమంలో 2019, 2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్‌లో పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నంబరుతో సహా ప్రస్తావించారన్నారు. పాస్‌పోర్టు ఆఫీసుకు తాజాగా వెళ్లాకే పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందని అసత్యం చెబుతున్నారన్నారు.

పరువునష్టం కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు పంపుతున్న సమన్లను హోదాను అడ్డుపెట్టుకొని జగన్‌ అందుకోవడం లేదన్నారు. అయిదున్నరేళ్లుగా పరువునష్టం కేసు విచారణను సాగదీస్తున్నారన్నారు. ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు విచారణను హైకోర్టు స్టే ఇచ్చిందని జగన్‌ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు.

వైఎస్‌ జగన్‌ పాసుపోర్టు కష్టాలు- లండన్‌ ప్రయాణం ఎలా? - High Court on Jagan Petition

షరతులు సహేతుకమే: విజయవాడ కోర్టు జగన్‌కు తాజాగా మరోసారి సమన్లు జారీచేసిందని, విచారణను ఈనెల 29కి వాయిదా వేసిందని గుర్తుచేశారు. ప్రత్యేక కోర్టులో కేసు విచారణను హైకోర్టు స్టే చేసిందని, తనపై నమోదైన పరువునష్టం కేసు గురించి తెలీదంటూ జగన్‌ హైకోర్టును తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. వాస్తవాలను దాచిపెడుతున్నారన్నారు. జగన్‌ పాస్‌పోర్ట్‌ను ఏడాది మాత్రమే రెన్యువల్‌ చేయాలని, తమ ముందు హాజరై రూ. 20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేన్నారు. వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ప్రస్తుత కేసు విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.

పాస్‌పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే.కృపాసాగర్‌ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌ పునరుద్ధరణ వ్యవహారంలో నిరభ్యంతరపత్రం(NOC) ఇచ్చేందుకు విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 5న కఠిన షరతులు విధించిందని పేర్కొంటూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

జగన్‌ విదేశీ పర్యటన - సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ - EX CM Jagan Foreign Tour

జగన్‌ తరఫున న్యాయవాది వాదనలు: సీఎంగా ఉన్నప్పుడు పిటిషనర్‌కు డిప్లొమేటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉండేదని, పదవి నుంచి దిగిపోయాక సాధారణ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాస్‌పోర్ట్‌ ఐదేళ్లు రెన్యువల్‌ చేసేందుకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు అంగీకరించిందని తెలిపారు. మరోవైపు విజయవాడ ప్రత్యేక కోర్టులో అప్పటి మాజీ మంత్రి పి.నారాయణ 2018లో దాఖలు చేసిన పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడి నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలని పాస్‌పోర్ట్‌ అధికారులు పిటిషనర్‌కు సూచించారని పేర్కొన్నారు. విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, ఏడాది మాత్రమే పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు అనుమతిచ్చిందన్నారు. రూ. 20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని షరతులు విధించిందని, ఈనెల 6 నుంచి 27లోపు లండన్‌ వెళ్లేందుకు అనుమతిచ్చిందని తెలిపారు.

సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతిస్తే, విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపిందన్నారు. అంతేకాక జగన్ను స్వయంగా కోర్టుకొచ్చి రూ 20వేల పూచీకత్తు బాండ్‌ను సమర్పించాలని షరతు విధించిందని అన్నారు. ఇలాంటి అదేశాలిచ్చే అధికారం విజయవాడ ప్రత్యేక కోర్టుకు లేదని వాదించారు. పరువునష్టం కేసులో విజయవాడ కోర్టు జారీచేసిన సమన్లు ఇంత వరకు పిటిషనర్‌కు అందలేదని వాదనలు వినిపించారు. అలాంటప్పుడు కేసు పెండింగ్‌లో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు.

పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదని, మరోవైపు విజయవాడ కోర్టులో పరువునష్టం కేసు విచారణను హైకోర్టు గతంలో నిలుపుదల చేసిందన్నారు. కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇన్ని షరతులతో కుమార్తె దగ్గరకు వెళ్లాలంటే ఏవిధంగా సాధ్యపడుతుందన్నారు. అయిదేళ్లు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్‌ చేస్తే ప్రాసిక్యూషన్‌కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలని కోరారు.

బుడమేరు నదంట - జగన్‌ మాటలకు నవ్వుకుంటున్న జనం - సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదుగా - TROLLS ON YS JAGAN COMMENTS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.