ETV Bharat / state

రీల్స్ పిచ్చి పీక్స్ - ఫాలోవర్స్​ కోసం డేంజరస్ ఫీట్స్ - లైకుల కోసం లైఫ్​నే రిస్క్ - SOCIAL MEDIA IMPACT ON FAMILIES

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:43 AM IST

Youth With Reels Dilution : సోషల్ మీడియా మోజులో పడిన నేటి యువత రోజురోజుకు బరిదెగిస్తున్నారు. రీల్స్, యూట్యూబ్ షాట్స్​పై పిచ్చి పీక్స్​కు పోయి లైకుల కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. రీల్స్ మోజులో పడి కుటుంబాన్ని పక్కకు పెట్టేస్తున్న కొన్ని కేసుల్లో హత్యలు జరుగుతుంటే, లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ఫీట్స్ చేస్తూ ఇంకొందరు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు.

Youth Losing Their Lives in the Craze of Reels
Youth Losing Their Lives in the Craze of Reels (ETV Bharat)

Youth Losing Their Lives in the Craze of Reels : రీల్స్‌ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతున్న వారు కొందరైతే మరికొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. కంటెంట్‌ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి అనుకుని కనీస జాగ్రత్తలు పాటించకుండా రీల్స్‌ చేస్తున్నారు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటున్నారు. అంతకుమించి అందరిలోవారు స్పెషల్‌గా కనిపించొచ్చు. ఇలా కారణాలు అనేకమైనా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు, రీల్స్‌ మోజులో పడి కొందరు నేరాలకు తెరలెపుతుంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు

  • ఇద్దరు యువకులు రీల్స్‌కు బానిసలుగా మారి ద్విచక్రవాహన దొంగలుగా మారారు. వారిని అదుపులోకి పోలీసులు విచారించగా 'ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసేందుకు ఖరీదైనా బైక్‌లు కావాలని అందుకే దొంగతనం చేశామని' చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
  • ఇటీవల హయత్‌నగర్‌లో ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్లు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేశారు. బైకు అదుపుతప్పి కిందపడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
  • రీల్స్‌ మోజులో పడి తనను, కుమార్తెను పట్టించుకోవడంలేదని చివరికి వంట కూడా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు అవ్వడంతో రెండేళ్ల చిన్నారి అనాథగా మారి ప్రభుత్వం సంరక్షణ గృహంలో ఆశ్రయం పొందుతోంది.

సోషల్​ మీడియాపై పిచ్చి పీక్స్ - రీల్స్‌ మోజులో యువతరం ప్రాణాలు బలి - instagram reels deaths

వ్యసనంగా మారుతున్న సోషల్‌ మీడియా : మద్యం గ్యాంబ్లింగ్‌కు బానిసగా మారినవారు ఎలా దాన్ని వదులుకోలేకపోతారో సామాజిక మాధ్యమాలకు వ్యసనంగా మారిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో అందరిలో స్పెషల్‌ గుర్తింపు ఉండాలనే భావన ఎంతకైనా దారితీస్తుందని పేర్కొన్నారు. పోస్ట్‌ చేసిన వీడియోలకు, ఫొటోలకు లైకులు రాకపోతే ఒత్తిడిని లోనవుతున్నారని తెలిపారు. బైక్‌పై స్టంట్లు వేయడం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్నట్లు వీడియోలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం, అవసరం లేకున్నా అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం ఇవన్నీ ఇలాంటి కోవకే చెందినవంటున్నారు.

చిచ్చు పెడుతున్న మోజు : రీల్స్‌ మోజు పచ్చని సంసారాల్లోనూ చిచ్చుపెడుతోంది. ఓ మహిళ అతిగా రీల్స్‌ చేస్తు కుటుంబాన్ని పట్టించుకోలేదు. దీంతో భర్తను ఆమెను మందలించగా ఇంట్లో వంటచేయడం కూడా మాసేసింది. ఇదేమీ అని భర్త అడగ్గా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను హత్యచేశాడు. ఇలాంటి ఘటనలు నగరంలో పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను విచారించగా భార్య తరచూ రీల్స్‌ చేస్తూ పిల్లల్ని పట్టించుకోవడం లేదని మందలించగా తను ఇలా కేసు పెట్టిందని చెప్పేసరికి శాకయ్యారు.

"డిజిటల్ లిటరసీ లేకపోవడం కూడా సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. ఎలాగైనా సరే అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకోవడం ప్రధాన సమస్య. దీనికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక మాధ్యమాలను అవసరాన్ని బట్టే వాడాలి. పిల్లలకు ఫోన్‌ ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు అన్నది గమనించాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్‌ అతిగా వాడుతుంటే కచ్చితంగా వారికి హద్దులు చెప్పాలి." - గౌతని నాగభైరవ, మానసిక వైద్య నిపుణులు

రీల్స్ మోజులో భార్య - హత్య చేసిన భర్త - వీడిన ఉప్పల్​ మర్డర్ మిస్టరీ - Man Killed wife in Uppal

వర్షంలో తడుస్తూ అమ్మాయి రీల్స్- సడెన్​గా భారీ శబ్ధంతో పిడుగు- ఆ తర్వాత ఏమైదంటే? - Lightning struck while making reels

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.