Youth Climbed Cell Tower to Attempt Suicide in NTR District : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెద్దలకు తెలియదు ఈ సంగతి. ఆపై ఆ దంపతులిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ ఘటన జరిగింది. ఉన్నట్టుండి, ఆ యువకుడు సెల్ టవర్ ఎక్కి తాను ఆత్మహత్యకు సిద్దపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.
పల్నాడు (Palnadu) జిల్లా క్రోసూరు మండల కేంద్రంలో సెల్ టవర్ (Cell Tower) ఎక్కి ఓ యువకుడు హల్ చల్ చేశాడు. పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్రోసూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి (22), ఓ యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం యువతితో కలిసి సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు అతడిని బెదిరించడంతోపాటు ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అతడిని సముదాయించారు. డీఎస్పీ హామీ ఇస్తేగానీ కిందకి దిగనని యువకుడు చెప్పాడు. పోలీసులు అతడిని కిందకు రప్పించారు. బంధువుల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు యువకుడు టవర్‌పైనే ఉన్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్న మమ్మల్ని ఇలా విడదీశారని, వివాహం చేసుకుని చూసుకుంటున్న షేక్ మస్తాన్ వలి ఆందోళన చెందుతున్నాడు. తనను కొట్టి భార్యను తీసుకెళ్లారని ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో తాను ఆత్యహత్య చేసుకుంటానని సెల్ టవర్‌పైకి ఎక్కి హల్ చల్ చేశారు. తన భార్యను తనకు అప్పగించాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ పెట్రోల్ డబ్బాతో స్థానిక సెల్‌ఫోన్ టవర్ ఎక్కడంతో అక్కడ ప్రజలంతా చేరారు. సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు యువకుడికి హామీ ఇచ్చారు. అనంతరం యువకుడు సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు.
పేదింటి అబ్బాయితో ప్రేమ వివాహం- కత్తితో దాడి చేసి కుమర్తెను తీసుకెళ్ళిన వైసీపీ నేత