ETV Bharat / state

క్షణకాలపు ఆవేశంలో యువ దంపతులు ఆత్మహత్య- అనాథలుగా మారిన పసి పిల్లలు - Young couple suicide in nellore - YOUNG COUPLE SUICIDE IN NELLORE

Young Couple Suicide in Nellore : వారిద్దరూ ఒకరిపైఒకరు మనుసుపడి, మనువాడారు. చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు వారి కాపురం సాగింది. పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. సంతోషంగా సాగిపోతున్న వారి పచ్చని కాపురంలో మద్యం చిచ్చురేపింది. చివరికి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు నెలలు పసిగుడ్డు, రెండేళ్ల మరో బాలుడు అనాథలుగా మిగిలిపోయారు.

Young Couple Suicide in Nellore
Young Couple Suicide in Nellore (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 6:34 PM IST

Young Couple Suicide in Nellore : వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిండు నూరేళ్లు కలసి జీవించాలని అనకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వారి పచ్చని కాపురంలోకి మద్యం చిచ్చు రేపింది. అంతే ఒక్కసారిగా ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో తీవ్ర కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం కన్నీమున్నీరైన భర్త, భార్య లేనిదే తాను జీవించలేనని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అభం శుభం తెలియని చిన్నారులిద్దరూ అనాథలుగా మారారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

'నేను చేసిన తప్పును నా భర్త, అత్తామామలు క్షమించినా - మా పిన్ని దుష్ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాం' - Couple committed suicide

పచ్చని కాపురంలో మద్యం చిచ్చు : నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ నగర్​కి చెందిన కాకర్ల నాగారాజు(23), సురేఖ(19) భార్య భర్తలు. వీరిద్దరూ రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరికి సుమారు 2 సంత్సరాలు కాగా, మరో కుమారుడు కొద్ది నెలల క్రితమే జన్మించాడు. నాగారాజు టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య సురేఖ సైతం భర్తకు ఆర్థికంగా అండగా ఉండేందుకు స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. ఇలా సంతోషంగా సాగిపోతున్న వారి పచ్చని కాపురంలో మద్యం చిచ్చురేపింది. గత కొంత కాలంగా నాగారాజు మద్యానికి బానిసై సంపాదించిన డబ్బంత తాగడానికే ఖర్చు పెట్టేవాడు. దీంతో కుటుంబపోషణ మెుత్తం భార్య సురేఖపై పడింది.

సహనం కోల్పోయి ఆత్మహత్య : మద్యం తాగవద్దని సురేఖ చాలా సార్లు నచ్చచెప్పింది. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయిన మాటవినని నాగారాజు ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో సహనం కోల్పోయిన సురేఖ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరిలించారు. అయితే సురేఖ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న భర్త నాగారాజు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన వల్లే భార్య మరణించిందని వాపోయాడు.

గుక్కపట్టి ఏడుస్తున్న పసిపిల్లలు : భార్య లేనిదే తాను జీవించలేనని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఆసుపత్రి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తలిద్దరు పంతానికిపోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో వారినే నమ్ముకున్న అభం శుభం తెలియని ఆ చిన్నారులిద్దరూ అనాథలుగా మారారు. అమ్మనాన్నల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసివాళ్లను చూసిన అక్కడి వారంతా కంటనీరు పెట్టుకున్నారు.

వివాహితతో వాలంటీర్ వివాహేతర సంబంధం - ఆత్మహత్య చేసుకున్న జంట - Couple commits suicide in AP

మూఢ నమ్మకంతో ఆత్మహత్యలు.. ప్రత్యేక యంత్రంతో తలలు నరుక్కుని, హోమగుండంలో పడేలా చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.