YCP Leaders Occupied Mandara Pond in Nellore District : వైఎస్సార్సీపీ గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ల సహకారంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగించారు. అంతేకాకుండా చెరువులో కుంటలను ఆక్రమించుకొని ఏకంగా భవనాలను నిర్మించుకున్నారు. దీంతో నీటి నిల్వలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలకు త్రాగునీరు, సాగునీరు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కీలక ప్రాజెక్టులపై పరస్పర సహకారం- చంద్రబాబు మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరం: రేవంత్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావాలి పట్టణ పరిధిలోని ముసునూరు సమీపంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం ఉండే ప్రాంతంలో 133 ఎకరాల మందార చెరువు విస్తీర్ణం ఉండేది. అది కాస్త 20 ఎకరాలు పైగా ఆక్రమించేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మందాటి చెరువును పరిరక్షించి పరిసరాల్లో పచ్చదనం అభివృద్ధి చేస్తామని నాయకులతోపాటు పురపాలక అధికారులు జాతీయ హరిత ట్రైబనల్ కు నివేదించారు. కానీ ఆచరణ దిశగా అడుగులు పడలేదు. మరోవైపు ఆక్రమణలు పెరిగిపోయాయి. రావుల పట్టణం నుంచి ఉదయగిరి మార్గం జాతీయ రహదారి సమీపంలో ఉన్న బొట్లగుంట విస్తీర్ణం 10 ఎకరాల్లో ఉండేది. దాదాపు 8 ఎకరాలు పైగా ఆక్రమణ గురైంది. రెవిన్యూ సర్వేనెంబర్ 2048 బి లో బొట్లగుంట రికార్డులను తాసిల్దార్ కార్యాలయంలో మాయం చేశారు.
ఇవే కాకుండా పాపిరెడ్డి చెరువు, అన్నపుగుంట లతో పాటు ఐదు చెరువులు ఉండేవి. అవన్నీ కూడా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం గెలుపొందిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిపై సమగ్రమైన విచారణ చేపట్టి ఆక్రమణలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగుమా టి వెంకట కృష్ణారెడ్డి పట్టణంలో నెలకొన్న ఆక్రమణల్లో నివారించే దిశగా చర్యలు చేపట్టి ఆక్రమణ తొలగించేందుకు రంగం సిద్ధం చేశాడు.
రండి రండి దయచేయండి! తమరి రాక మాకెంతో ఆనందం సుమండి! - AP and Telangana CMs Meeting