YCP Govt Taking Rs 7 Thousand Crore Loans Through APMDC: ఎన్నికల కోడ్ ప్రకటన వచ్చేలోపు మరో 7 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మైనింగ్ శాఖ ద్వారా రుణం సమకూర్చుకునేందుకు దస్త్రాన్ని కదిపింది. దీనికి నేడో, రేపో అన్‌లైన్‌లో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మైనింగ్ శాఖ పేరుతో రుణం తీసుకుంటున్నా ఆ సొమ్మంతా ప్రభుత్వమే తీసుకోనుంది.
బడా కంపెనీకి అనుకూలంగా బీచ్ శాండ్ టెండర్ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు!
చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు బాండ్ల ద్వారా రుణం: రుణాల కోసం ఏ అవకాశాన్నీ జగన్ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నా ఈ లోపే 7 వేల కోట్ల రూపాయల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ- ఏపీఎండీసీ (AP Mineral Development Corporation) ద్వారా ప్రైవేటు బాండ్ల రూపంలో 7 వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిపింది. ఆఘమేఘాలపై మంత్రివర్గ ఆమోదం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏపీఎండీసీ చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు బాండ్ల ద్వారా రుణం తీసుకోనున్నారు. అదీ ఏపీడీఎంసీ అవసరాల కోసం కాకుండా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ దస్త్రాన్ని రూపొందించారు. దీన్ని రెండురోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు.
ఏపీ పరిశ్రమల బాటలో.. ఏపీఎండీసీ.. దేశవ్యాప్తంగా రోడ్ షో నిర్వహణ కోసం ప్రణాళికలు
ఆన్‌లైన్‌లోనే మంత్రుల నుంచి ఆమోదం: ఈ దస్త్రానికి మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి అని తెలిసింది. దీంతో ఆన్‌లైన్‌లోనే మంత్రుల నుంచి ఆమోదం తీసుకునేలా ఏర్పాటు చేసి గురు, శుక్రవారాల్లో ఈ వ్యవహారం పూర్తయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వెంటనే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లో లిస్టింగ్ చేసి బాండ్ల ద్వారా ఏపీఎండీసీ రుణం తీసుకోనుంది. ప్రస్తుతానికి 8.7 శాతం వడ్డీరేటుతో రుణానికి ప్రతిపాదించారు. ఈ వడ్డీరేటుకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే దాన్ని మరింత పెంచే వీలుందని సమాచారం.
APMDC: జోరుగా ముగ్గురాయి అక్రమ రవాణా.. సిబ్బంది మధ్య విభేదాలతో వెలుగులోకి
ఏపీఎండీసీకి భారం కానున్న వడ్డీ: బాండ్ల ద్వారా రుణం తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న ఏపీఎండీసీకి వడ్డీ మాత్రం అధిక భారం కానుంది. పదేళ్లపాటు ఒక్కో సంవత్సరానికి 610 కోట్ల మేర వడ్డీ చెల్లించాలి. రుణం వాడుకోకుండా వడ్డీ మాత్రం కట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాల కోసం కనీసం 2 వేల కోట్లు అయినా ఉంచుకునేలా చూడాలని పలువురు అధికారులు ఎండీ వెంకటరెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. అయినా మొత్తం రుణాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకే ఎండీ నిర్ణయించారని సమాచారం.