ETV Bharat / state

బడ్జెట్‌ను ఘనంగా వెల్లడించిన వైసీపీ సర్కార్‌ - కేటాయింపులు మాత్రం అరకొరగానే - AP Budget 2024

YCP Govt Budget Allocations 2024-25: బడ్జెట్‌లో అంచనాలను ఘనంగా వెల్లడించిన వైసీపీ సర్కార్‌ తాము ప్రాధాన్యతగా పెట్టుకున్న రంగాలకు అరకొర కేటాయింపులే చేసింది. రాబడిలో నాలుగోవంతు అప్పులు తీర్చాడానికే వెచ్చించాల్సిన పరిస్థితుల్లో ఆయా రంగాలకు నామమాత్రంగానే నిధులు కేటాయించింది. ఫలితంగా సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. రైతుకు భరోసా లేకుండా పోయింది. ఇక ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామన్న జగనన్న కాలనీల నిర్మాణానికి 7వేల కోట్లే ఖర్చుపెడతామని ప్రకటించారు.

ycp_budget
ycp_budget
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 10:07 AM IST

బడ్జెట్‌ను ఘనంగా వెల్లడించిన వైసీపీ సర్కార్‌ - కేటాయింపులు మాత్రం అరకొరగానే

YCP Govt Budget Allocations 2024-25: జలయజ్ఞానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కుదేలయింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ కలిపి మొత్తం 1,64,815 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. ఈ అయిదేళ్లలో ఇచ్చింది 37,228 కోట్లు మాత్రమేనని ప్రభుత్వమే అధికారికంగా చెబుతోంది. నిజానికి తుది లెక్కలు తేలేసరికి కేటాయింపులు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలను కొద్దిగా ఎక్కువ చేసి చూపినట్లు కనిపిస్తోంది.

జలవనరుల శాఖ సాగునీటి ప్రాజెక్టులపై మొదటి నాలుగేళ్లలో ఎప్పుడూ ఏడాదికి 7,200 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. అలాంటిది ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు ఏకంగా 10,951 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అక్టోబరు వరకు 4,942 కోట్లే ఖర్చు చేసినట్లు సర్కార్‌ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న రెండు నెలల్లో చేయబోయే ఖర్చును కూడా కలిపేసుకుని సవరించే అంచనాలు ఇచ్చారు. తుది లెక్కలు తేలేసరికి ఖర్చు తగ్గిపోయే అవకాశమే ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇలాగే సవరించిన అంచనాల్లో 7,102 కోట్లు చూపారు. చివరికి అది 6,262 కోట్లకే పరిమితమైంది.

తెలంగాణలో వెలుగులు - ఏపీలో చీకట్లు - విద్యుత్‌ రంగంలో ఆంధ్రావని వెనకబాటు

జగన్‌ హయాంలో కేవలం ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న నెల్లూరు, సంగం బ్యారేజిలను పూర్తి చేశారు. అవుకు రెండో టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ టన్నెల్‌ ద్వారా నీళ్లు తీసుకువెళ్లి గండిపేటలో నిల్వ చేసినా ఆయకట్టుకు మళ్లించే సౌలభ్యాలు లేవు. ఎప్పటి నుంచో గండికోటలో నీళ్లు నింపడం తప్ప ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీలు జగన్‌ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. చంద్రబాబు హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తైన కుప్పం కాలువకు నీళ్లు ఇచ్చి మమ అనిపించారు. మిగిలిన ప్రాజెక్టుల్లో ఏదీ పూర్తి కాలేదు. ఉత్తరాంధ్రలో అయితే అన్నీ నిర్మాణదశలోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరెన్నో ప్రాజెక్టులు నిర్మాణంలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు.

బుగ్గన బడ్జెట్‌లో రైతుకు భరోసా కొరవడింది. రైతు సంక్షేమమంటూ గొప్పలు చెప్పే వైసీపీ సర్కారు వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు పెట్టలేకపోతోంది. 2019-20లో సాగు రంగానికి 20 వేల కోట్లు కేటాయించగా, ఖర్చు పెట్టింది 7 వేల కోట్లు మాత్రమే. అంటే 34 శాతమే. 2021-22 బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ అంతిమంగా వెచ్చించింది 61శాతమే. 2023-24 ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో అసలు పంటలే వేయలేదు. రబీలోనూ 17 లక్షల ఎకరాలు బీడుగా పడి ఉంది. 43 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

ఈ తరుణంలో కేటాయింపులకు మించి సాయం అందించాలి. కానీ, సవరించిన అంచనాలను పరిశీలిస్తే కేటాయింపుల్లో 83శాతం ఖర్చు చేశారు. వాస్తవ లెక్కలు తేలేసరికి ఇంకా తగ్గే అవకాశముంది.వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2024-25లో 13,552 కోట్లు ప్రతిపాదించారు. ఇది గతేడాది కంటే 400 కోట్లు ఎక్కువ. శాఖల వారీగా చూస్తే వ్యవసాయానికి 11,424.51 కోట్లు, పశు సంవర్ధక, మత్స్య శాఖలకు 1,858 కోట్లు, సహకార శాఖకు 264.78 కోట్ల చొప్పున కేటాయించారు.

ఇళ్లు కాదు, ఊళ్లు కడుతున్నామంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటి వరకు దీనికోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టింది 8 వేల కోట్లే. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నకాలనీల్లో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిలో ఇప్పటివరకు 5.94 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో ఇంటిపై కేంద్రమిస్తున్న 1.80 లక్షలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో లక్ష ఇవ్వాలని లబ్ధిదారులు మొత్తుకున్నా పట్టించుకోలేదు.

కాలనీల్లో మౌలిక వసతులు సక్రమంగా కల్పించడం లేదు. లబ్ధిదారులను వారి కష్టానికి వారిని వదిలేశారు. గ్రామీణ పేదల పట్ల జగన్‌ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్క రూపాయీ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వలేదు. కేంద్రమిచ్చే నిధులతోనే సరిపెడుతున్నారు. మొత్తంగా ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన వాగ్దానం మేరకు 25 లక్షల ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా 30 వేల కోట్లు అవసరం. 2024-25 ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లోనూ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. కేవలం 7,062.84 కోట్లు కేటాయించారు. పైగా 2024 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

మమ్మల్నే డబ్బులు అడుగుతావా? - టోల్ గేట్ సిబ్బందిని చితకబాదిన వైఎస్సార్సీపీ నేత

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, వడ్డీల భారం ఏటేటా పెరిగిపోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మరింత అధికం కానుంది. 2023-24లో 18,411 కోట్ల అప్పు అసలు చెల్లించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 25,212.57 కోట్లకు చేరనుంది. 2021-22లో 6శాతం ఉన్న అప్పుల చెల్లింపుల వాటా 2022-23లో 13 శాతానికి చేరింది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. వచ్చే సంవత్సరం అప్పులు, వడ్డీలు కలిపి 53,229.76 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 2024-25లో మొత్తం 71 వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకోనున్నట్లు సర్కారు వెల్లడించింది.

నిజానికి బడ్జెట్‌లో చెప్పిన దానికంటే ఎక్కువే అప్పులు చేస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2022-23లో 55 వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకుంటామని ప్రతిపాదించి, 57,487 కోట్లు సేకరించింది. 2023-24లో 63 వేల కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం ఇది 69 వేల కోట్లకు చేరవచ్చని ప్రస్తావించారు. ఈ లెక్కన వచ్చే ఏడాది రుణ సేకరణ ఎక్కువేనన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌ రుణాలే ఇలా ఉంటే, కార్పొరేషన్ల పేరిట, ఇతరత్రా మార్గాల్లో సేకరించే అప్పులు మరింత పెరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.