Woman Interested in Car Driving in Visakha : నేటి మహిళలు వంటగది నుంచి అంతరిక్షం వరకు ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. వయసు సంబంధం లేకుండా బైక్‌లు,కార్లు రయ్ రయ్‌మని నడుపుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం విశాఖ నగరంలో వాహనాలు నడుపుతున్న వారిలో 35% మంది మహిళలే ఉన్నారు. విశాఖ నగర శివారుల్లో పలు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో పనిచేసే మహిళా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు చాలా మంది సొంత వాహనాలపైనే వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి కంపెనీ ఆటోగేర్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. దీంతో వాటిని నగరాల్లో మహిళలు నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిని నడిపేందుకు చాలా అనుకూలంగా ఉంటున్నాయని నారీమణులు చెబుతున్నారు.
70 ఏళ్ల వయసులో : పెందుర్తికి చెందిన అనురాధకు 70 ఏళ్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆమె, తన మనవరాలితో కలసి స్థానికంగా ఉన్న డ్రైవింగ్ స్కూల్‌కు వచ్చారు. ఈ వయస్సులోనూ బామ్మా చాలా ఉత్సాహంగా శిక్షణ పూర్తిచేయడంతో పాటు లెర్నింగ్ లైసెన్స్ పొందారు. తన చిన్నప్పటి నుంచి కారు నడపాలనే కోరిక ఉండేదని, ఇప్పటికది నెరవేరిందని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
ఇంట్లో పురుషులు ఫోన్ చేసి తమ కుమార్తె లేదా భార్యకు నేర్పించాలని అడుగుతున్నారు. ఇటీవల ఓ ఇంగ్లిషు మ్యాగజైన్ చేసిన సర్వేలో పురుషులతో పోలిస్తే మహిళలు బాధ్యతగా వాహనాలు నడుపుతున్నట్లు తేలింది. వారు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలూ తక్కువే -రాధిక బెహర, శిక్షకులు
అతివల సంఖ్యే ఎక్కువ: విశాఖ జిల్లాలో పెందుర్తి, మురళీనగర్, సిరిపురం, గాజువాకలో వరుణ్ మారుతి గ్రూప్‌నకు బ్రాంచీలు కలవు. ఇక్కడ నెలకు 200 మందికి పైగా కారు నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. అందులో 60% మహిళలే ఉన్నారు. డ్రైవింగ్ నేర్చుకున్న వారందరూ లైసెన్సు తీసుకుంటున్నారని సిబ్బంది తెలియజేశారు. ఈ మధ్య కాలంలో డ్రైవింగ్ అవసరాన్ని ఉపాధిగా మార్చేందుకు విశాఖకు చెందిన రాధిక బెహర ‘ఫెమిరైడ్స్’ అనే సంస్థను స్థాపించారు. వనితలకు రక్షణగా ప్రత్యేక వాహన సేవలు అందిస్తున్నారని యాజమాన్య సిబ్బంది పేర్కొన్నారు. లైసెన్స్ ఉంటే మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి కారు డ్రైవర్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు 80 మందికి కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు.
11ఏళ్లకే 19 పతకాలు - కరాటేలో సత్తా చాటుతున్న తణుకు చిన్నారి - TANUKU KARATE GIRL
అందుబాటులో నాలుగు కోర్సులు : బైక్ నడపటంపై అవగాహన ఉన్న మహిళలు కారు డ్రైవింగ్ వేగంగా నేర్చుకుంటున్నారని వరుణ్ గ్రూప్ శిక్షకులు హరి సంతోష్ వెల్లడించారు. మిగిలిన వారికి కొంత సమయం పడుతుందని తెలియజేశారు. తమ వరుణ్ గ్రూప్‌లో 10, 21, 26, 31 రోజుల కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువ మంది మహిళలు 21 రోజుల కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.
నేను బైక్‌ను నడపగలను. కారు నడపాలనే ఆసక్తితో శిక్షణ తీసుకున్నా. తొలి అయిదు రోజులు ట్రాఫిక్ నిబంధనలపై తరగతులు నిర్వహించారు. అనంతరం సిములేటర్‌పై, కారుతో శిక్షణ ఇచ్చారు -సీహెచ్ అనురాధ, గృహిణి, మర్రిపాలెం వుడాకాలనీ
రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating