ETV Bharat / state

ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు - అంతలోనే మలుపు తిరిగిన ప్రయాణం - కళ్లు చెమర్చే ఘటన - HUSBAND DEATH WIFE SUICIDE

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భర్త - మరణ వార్తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య

Wife Committed Suicide Because Her Husband Died
Wife Committed Suicide Because Her Husband Died (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 2:54 PM IST

Wife Committed Suicide Because Her Husband Died : ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది. రోడ్డు ప్రమాద రూపంలో భర్తను విడదీసింది. ఈ చేదు వార్త విన్న ఆమె గుండె తట్టుకోలేకపోయింది. భర్తలేని లోకంలో నేనుండలేనంటూ తానూ ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి : జిల్లాలోని లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటి ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమ అనంతరం ఏడాదిన్నర కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భార్యభర్తలు ఇద్దరూ కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఎంతో అన్యోన్యంగా, ప్రేమ అనురాగాలతో మెలుగుతున్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి జీవితం సాగింది. చంటి దసరా రోజున ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

పండుగ పూట విషాదం - ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

భార్య ఆత్మహత్య : భర్త నాయిని చంటి మరణ వార్త విన్న భవానీ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తక్షణమే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. ఈ ఘటనతో కేశవరాయనపాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వైద్యులు భవాని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లావేరు పోలీసులు ఈ ఘటనలపై వేరు వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'ప్రేమలో మోసపోయాను'- యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్​ - LOVE FAILURE

బాపట్ల జిల్లాలో విషాదం- భార్యను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త - HUSBAND KILLED WIFE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.