ETV Bharat / state

ఇంట్లో ఇల్లాలు - లాడ్జిలో ప్రియురాలు - రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన ఎంపీడీవో - MPDO EXTRA MARITAL AFFAIR

ఇంట్లో ఇల్లాలు - లాడ్జిలో ప్రియురాలిని మెయింటేన్ చేస్తున్న ఎంపీడీవో - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్యాపిల్లలు - కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిన పోలీసులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 7:19 AM IST

Wife Caught Her Husband While He was with His Girl Friend : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఈ బంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డు కీడుస్తున్నాయి. అప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్న పరువూ మర్యాదలను బజారు పాలు చేస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్​లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, ఆయన ఓ ఎంపీడీవో అధికారి. ట్రాన్స్​ఫర్​లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళ పరిచయం కాగా, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది సొంత ఫ్యామిలీని కాదనుకుని, గత కొన్నాళ్లుగా ఆమెతోనే ఉంటున్నాడు. ఇంటికి రావడం మానేయడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి ఆయనపై నిఘా పెట్టగా, అసలు విషయం తెలిసింది. దీంతో ఆదివారం రోజున ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కర్నూల్ రోడ్డు కూడలిలోని ఓ లాడ్జిలో ఆయనను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు అక్కడకు చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని స్టేషన్​కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి, గత సార్వత్రిక ఎలక్షన్స్ సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. అక్కడ ఓ ఏఎన్​ఎంతో ఆయనకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అప్పటి నుంచి తన కుటుంబాన్ని దూరం పెట్టాడు. ఇంటికి వెళ్లడం మానేశాడు. భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో అనుమానం రావడంతో కుటుంబీకులు ఆయన కదలికలపై నిఘా పెట్టారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంగోల్​లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు తెలుసుకుని భార్య, కుమారుడు, కుమార్తె అక్కడకు చేరుకున్నారు. గదిలో ఉన్న ఎంపీడీవో, ఆయన ప్రియురాలైన ఏఎన్​ఎంను రెడ్ ​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకోగా, లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని ఠాణాకు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కూర్చుని మాట్లాడుకోవాలని, ఇలా వీధులకెక్కి పరువు తీసుకోవద్దని హితవు పలికి అక్కడి నుంచి పంపించేశారు.

వివాహేతర సంబంధం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్​ఏ హత్య - VRA Murder With Detonators in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.