Water Released from Nagarjunasagar to AP : కేఆర్ఎంబీ అధికారులు ఇవాళ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని విడుదల చేశారు. వేసవి దృష్ట్యా తాగు నీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేఆర్‌ఎంబీ(KRMB) అధికారులు నీటిని విడుదల చేశారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులు సాగర్ కుడికాలువ నుంచి రెండు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. తొమ్మిది రోజుల పాటు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటి విడుదలను ఇరు రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులు రీడింగ్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కేఆర్‌ఎంబీ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
KTR Reacts on Sagar Water Release : సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదలపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) స్పందించారు. " కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణకు శాపం! నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతినిచ్చింది. మరోవైపు సాగు నీళ్ల కోసం అరిగోసలు పడుతున్న తెలంగాణ రైతన్నలు, నీళ్లు అందక పంటలు నిలువునా ఎండుతున్నాయి. సవాళ్లు నరుకుడు కాదు గుంపు మేస్త్రీ, దమ్ముంటే సమయానికి రైతులకు నీళ్లు అందేలా చూడు. మన రాష్ట్ర హక్కులు కాపాడేలా పోరాడు." అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ అభ్యంతరం - రంగంలోకి కేఆర్‌ఎంబీ
Krishna Water Disputes Issue : మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని, కృష్ణా జలాలపై చేసిన శాసనసభ తీర్మానం కేంద్ర జలవనరుల శాఖకు చేరింది. రాష్ట్ర నీటి పారుదలశాఖ కార్యదర్శి రాసిన లేఖను, కృష్ణా బోర్డు కేంద్రానికి నివేదించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు.
ఇదీ అసెంబ్లీ తీర్మానం : కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పవర్ పాయింట్ ద్వారా ఆ విషయాలను శాసనసభ్యుల వివరించారు. షరతులు అంగీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.
కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు : ఉత్తమ్
తుమ్మిడిహట్టి వద్ద పాత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మాణానికి పరిశీలిస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి