ETV Bharat / state

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - ప్రకాశం బ్యారేజి 40 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేసిన అధికారులు. - పులిచింతల నుంచి 1,36,577 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

water_releas_from_prakasam_barrage
water_releas_from_prakasam_barrage (ETV Bharat)

Water Release from Prakasam Barrage : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఎగువన పులిచింతల నుంచి 1,36,577 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 44.18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కృష్ణా డెల్టా తూర్పు కాలువలకు 4,028 క్యూసెక్కుల నీరు, కృష్ణా డెల్టా పశ్చిమ కాలువలకు 2,519 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

మిగిలిన 77,750 క్యూసెక్కుల నీటిని అధికారులు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 12 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీలో 3.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రకాశం బ్యారేజి నుంచి 739 టీఏంసీల మేర నీటిని సముద్రంలోకి విడుదల చేసారు.

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది.

నాగార్జున సాగర్‌ 5 గేట్లు ఎత్తి నీటి విడుదల : ఇటీవల కురిసిన వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjunasagar project) నిండుకుండలా మారింది. జలాశయం నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో 12 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,338 క్యూసెక్కులు రావడంతో అంతే మొత్తంలో సాగర్‌ కుడి, ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది.

ప్రమాదంలో తుంగభద్ర క్రస్ట్ గేట్లు! - పోటెత్తుతున్న వరద - అధికారుల్లో ఆందోళన

మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం జలాశయం గేట్లు - నాగార్జునసాగర్​కు వరద ఉధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.