ETV Bharat / state

ఏలూరు జిల్లాలో వార్డెన్‌ భర్త ఆకృత్యాలు - ఫొటోషూట్‌లంటూ బాలికలపై లైంగిక దాడి - Eluru Girls Hostel Incident - ELURU GIRLS HOSTEL INCIDENT

Eluru Girls Hostel Incident: మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వసతిగృహం ముసుగులో బాలికలపై ఓ వార్డెన్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

Eluru Girls Hostel Incident
Eluru Girls Hostel Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 11:00 AM IST

Sexual Assault on Girls in Eluru District : నేటి కాలంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్లయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా వసతిగృహం ముసుగులో ఓ కామాంధుడు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఫొటోషూట్‌లంటూ ఆశ చూపి, మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతిగృహం ఉండేది. సుమారు 50 మంది అక్కడ వసతి పొందుతూ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు.

Eluru Girls Hostel Incident
నిందితుడు శశికుమార్ (ETV Bharat)

Wardens Husband Misbehavior Girls : కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు వసతిగృహాన్ని సరిగా పట్టించుకోలేదు. దీంతో నెమ్మదిగా ఏలూరువాసి శశికుమార్‌ దానిని చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్​ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. ఏలూరులో ఫొటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. వసతిగృహం వద్ద వార్డెన్‌గా తన రెండో భార్యను, సంరక్షకురాలిగా మేనకోడలిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

శశికుమార్‌ ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు మంగళవారం రాత్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్‌ అంటూ ఈ నెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకున్నాడని తెలిపారు. బాపట్ల తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 16న వసతిగృహంలో దింపాడని వాపోయారు.

వెంటనే స్పందించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ వసతిగృహాన్ని పరిశీలించారు. బాలికల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. నిందితుడు, అతడికి సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన వివరించారు. మరోవైపు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిసింది.

అవనిగడ్డలో దారుణం - ఎస్సీ బాలికపై కబడ్డీ కోచ్ అత్యాచారం - Kabaddi Coach Rape on Girl

మైనర్‌ కుమార్తెపై అత్యాచారం- కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.