Voters In Konaseema District : 2024 సార్వత్రిక ఎన్నికల్లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. కోనసీమ జిల్లావ్యాప్తంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య తేలింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 15,31,410 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్‌లోకి 2 కోట్ల మంది యువత
పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల, మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ పూర్తయింది. మృతులు, వలసదారులు ఇతరుల ఓట్లు తొలగించి తుది జాబితాను సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 7,59,104, మహిళా ఓటర్లు 7,72,285 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 13,181 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో కొత్తపేట నియోజకవర్గంలో అత్యధికంగా 2,52,383 మంది జిల్లాలో అత్యల్పంగా రాజోలు నియోజకవర్గంలో 1,97,920 మంది ఓటర్లున్నారు.
రెండు నెలల్లో 42వేల మంది ఓటర్లు పెరుగుదల : ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 14,88,794 మంది ఓటర్లు నమోదయ్యారు. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా సోమవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 15,31,410 మందికి పెరిగారు.
'నేటికీ 33శాతం మంది ఓట్లు వేయడం లేదు - పోలింగ్ శాతం తగ్గితే ఓటు బ్యాంకు రాజకీయాలు'
ఈ లెక్కన రెండు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 42,616 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో మహిళా ఓటర్లు 24,262 మంది, పురుషుల ఓటర్లు 18,355 మంది పెరిగారు. నియోజకవర్గాల వారీగా అమలాపురంలో అత్యధికంగా 7,126 మంది, అత్యల్పంగా రామచంద్రపురంలో 5,026 మంది ఓటర్లు పెరిగారు. రామచంద్రపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఒకరు చొప్పున, పి. గన్నవరం, కొత్తపేట, మండపేటల్లో ఆరుగురు చొప్పున ఉన్నారు. ముమ్మిడివరం పరిధిలో కొత్త ఓటర్లు లేరు. పలు వర్గాల వారీగా జిల్లాలో ఎన్నారై ఓటర్లు 277, సర్వీస్ ఓటర్లు 819 మంది, 18-19 సంవత్సరాల వయసు ఉన్న వారు 38,480 మంది, 85 సంవత్సరాలు పైబడినవారు 8,344, దివ్యాంగులు 26,039, దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 3,534 మంది ఉన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలు- ఓటేసేందుకు 96 కోట్ల మందికిపైగా అర్హులు